Home > క్రీడలు > మీడియాపై మండిపడ్డ విరాట్ కోహ్లీ.. పాపం మరి ఇలా చేస్తారా!

మీడియాపై మండిపడ్డ విరాట్ కోహ్లీ.. పాపం మరి ఇలా చేస్తారా!

మీడియాపై మండిపడ్డ విరాట్ కోహ్లీ.. పాపం మరి ఇలా చేస్తారా!
X

తనపై ట్రోల్స్ వచ్చినా.. ఇష్టం వచ్చినట్లు దూషించినా.. తన కెరీర్ పై విమర్శలు చేసినా.. విరాట్ కోహ్లీ ఎప్పుడూ శాంతంగానే ఉన్నాడు. ప్రతీ సమస్యను సున్నితంగా హ్యాండిల్ చేశాడు. తన బ్యాటుతో సమాధానం ఇచ్చాడు. తన లైఫ్ లో ఇతరుల మెప్పు పొందేందుకు ఏ విషయంలో ప్రూవ్ చేసుకోవాల్సిన పనిలేదని చెప్పుకొచ్చాడు. అయితే, ఈ మధ్య కొన్ని రకాల సిల్లీ వార్తలు విరాట్ ను తెగ ఇబ్బంది పెట్టాయని తెలుస్తోంది. కాగా, ఓ జాతీయ మీడియా ప్రచురించిన ఫేక్ వార్తపై విరాట్ కోహ్లీ మండిపడ్డాడు. దానికి కారణం ఏంటేంటే..

మహారాష్ట్ర అలీబాగ్ లోని తన 8 ఎకరాల ఫామ్ హౌజ్ లో ఇళ్లు కట్టుకుంటున్నాడన్న విషయం తెలిసిందే. అయితే, ఆ ఫామ్ హౌజ్ లో విరాట్.. ఓ క్రికెట్ పిచ్ ను ఏర్పాటు చేసుకుంటున్నట్లు, అందులోనే ప్రాక్టీస్ చేస్తాడని వార్తలు వచ్చాయి. వాటిని ఓ జాతీయ మీడియా హైలైట్ చేసింది. అసలు నిజానికి ఆ వార్త ఫేక్. అదే విషయాన్ని విరాట్ ఖండించారు. ఆ వార్తను ట్యాగ్ చేస్తూ ‘చిన్నప్పటి నుంచి అదే వార్తా పత్రికలను చదువుతున్నా. ఇప్పుడు తప్పుడు వార్తలను ప్రచురించడం మొదలుపెట్టారు’ అని ఇన్ స్టాగ్రామ్ లో ఘాటుగా స్పందించాడు. దాంతో ఆ మాడియా వార్తను డిలీట్ చేసింది. ఇటీవలే ఇన్ స్టాలో తాను ఒక్కో కమర్షియల్ పోస్టుకు రూ.11కోట్లు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై కూడా కోహ్లి క్లారిటీ ఇచ్చారు.

Updated : 15 Aug 2023 10:30 PM IST
Tags:    
Next Story
Share it
Top