Home > క్రీడలు > IND vs PAK: ఈ మ్యాచ్ జరిగితే పాకిస్తాన్కు చుక్కలే.. ఎందుకంటే?

IND vs PAK: ఈ మ్యాచ్ జరిగితే పాకిస్తాన్కు చుక్కలే.. ఎందుకంటే?

IND vs PAK: ఈ మ్యాచ్ జరిగితే పాకిస్తాన్కు చుక్కలే.. ఎందుకంటే?
X

ఆసియా కప్ లో మరో కీలక మ్యాచ్ కు రంగం సిద్ధం అయింది. భారత్- పాకిస్తాన్ మొదటి రైవలరీ మ్యాచ్ ను వర్షం కారణంగా మిస్ అయిన అభిమానులకు మరో అవకాశం వచ్చింది. ఇవాళ (సెప్టెంబర్ 10) కొలంబో వేదికగా సూపర్ 4లో మరోసారి ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టాట్స్ చూస్తుంటే పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు కనపడటం పక్కా అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. మొదటి మ్యాచ్ లో అనుకోకుండా ఔట్ అయిన విరాట్.. ఈ మ్యాచ్ లో అయిన రాణించాలని కోరుకుంటున్నారు. కొలంబో స్టేడియంలో రన్ మెషిన్ కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఎన్నో అంతర్జాతీయ పిచ్ లై తనదైన ముద్ర వేసిన విరాట్ కు కొలంబో స్టేడియం ఫేవరెట్.

ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడుతుంటాడు. కాగా కొలంబోలో విరాట్ ఆడిన చివరి మూడు మ్యాచుల్లో విద్వంసం సృష్టించాడు. 103 సగటుతో 519 పరుగులు సాధించాడు. అందులో విరాట్ బ్యాట్ నుంచి 128*(119 బంతుల్లో), 131(96 బంతుల్లో), 110*(116 బంతుల్లో) పరుగులు వచ్చాయి. అయితే ఇవాళ జరిగే మ్యాచ్ కు వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే జరిగితే మరో రైవలరీ మ్యాచ్ తో పాటు.. విరాట్ కోహ్లీ విద్వంసకర బ్యాటింగ్ ను చూసే ఛాన్స్ ను మిస్ చేసుకున్న వాళ్లవుతామని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే.. భారత్ ఫైనల్ ఆశలు కూడా సన్నగిల్లుతాయి. తర్వాత మ్యాచులు తప్పకుండా ఆడి గెలవాల్సి ఉంటుంది.

Updated : 10 Sep 2023 6:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top