Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. క్యూ కడుతున్న అవార్డులు
X
టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డుకు కోహ్లీ ఎంపికయ్యాడు. గతేడాది ప్రతిభ ఆధారంగా కింగ్ కోహ్లీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. దీంతో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును నాలుగుసార్లు గెలుచుకున్న తొలి క్రికెటర్ గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. కోహ్లీ.. 2012, 2017, 2018, 2023లో ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డుతో కోహ్లీ గెలుచుకున్న ఐసీసీ అవార్డుల సంఖ్య 10కి చేరింది. కాగా ఐసీసీ నుంచి 10 అవార్డులు గెలుచుకున్న తొలి ప్లేయర్ గా కోహ్లీ ఘనత సాధించాడు. ఈ లిస్ట్ లో మరే ఇతర ఆటగాడు కోహ్లీ దరిదాపుల్లో కూడా లేరు. కనీసం ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఐదు అవార్డులు గెలుచుకోలేదు.
శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర 4 అవార్డులు, ఎంఎస్ ధోనీ 4 అవార్డులు అందుకున్నారు. గతేడాది కోహ్లీ అధ్భుతంగా రాణించాడు. 24 ఇన్నింగ్స్ లో 72.47 సగటుతో 1377 పరుగులు చేశాడు. అంతేకాకుండా వన్డే వరల్డ్ కప్ 2023లో 765 పరగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో మొత్తం 3 సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు బాదేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ లో సెంచరీ చేసి.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు 50 కొట్టిన క్రికెటర్ గా సచిన్ రికార్డ్ ను అధిగమించాడు. కాగా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమ్మిన్స్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ కు అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది.