Home > క్రీడలు > ఇప్పటివరకు ఒక్కసారి కూడా కోహ్లీ ఎన్సీఏకు వెళ్లలేదు..రోహిత్ శర్మ

ఇప్పటివరకు ఒక్కసారి కూడా కోహ్లీ ఎన్సీఏకు వెళ్లలేదు..రోహిత్ శర్మ

ఇప్పటివరకు ఒక్కసారి కూడా కోహ్లీ ఎన్సీఏకు వెళ్లలేదు..రోహిత్ శర్మ
X

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఎందరికో యూత్ ఐకాన్. రన్ మిషన్ గానే కాకుండా ఫిట్నెస్ పరంగా కూడా చాలామంది విరాట్ ను ఫాలో అవుతూ ఉంటారు. రెండేళ్ల నుంచి మున‌ప‌టి ఫామ్ తో దూసుకెళ్తున్న కింగ్ కోహ్లీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను బ‌ద్ధ‌లు కొడుతూ వ‌స్తున్నాడు. మైదానంలో దూకుడు కనబరుస్తూ చలాకీగా ఉండే మన చీకూ..పర్సనల్ గా చాలా కూల్ గా ఉంటూ అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటు ప్రస్తుత క్రికెట్ ఫార్మాట్ లో విరాట్, రోహిత్ ఇద్దరూ కలిసి జట్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వీరిద్దరినీ వారి అభిమానులు రోకో అని పిలుచుకుంటారు. జట్టులో రోకో ఉంటే ఆ మజానే వేరంటారు క్రికెట్ ప్రేమికులు.

తాజాగా ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కోహ్లీకి సంబంధించి యూత్ కు ఒక విలువైన టిప్ ఇచ్చాడు.

యంగ్‌స్ట‌ర్స్ అంతా కోహ్లీని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని హిట్‌మ్యాన్ సూచించాడు. జియో సినిమాలో క్రికెటర్ దినేశ్ కార్తిక్‌తో మాట్లాడిన రోహిత్..ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా కోహ్లీ నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీకి వెళ్ల‌లేదన్నారు. అంటే ఫిట్‌నెస్, ఆట‌పై అత‌డికున్న ఫ్యాషన్ ను అంద‌రూ గ‌మ‌నించాలని కోరాడు. విరాట్ క‌వ‌ర్ డ్రైవ్, ఫ్లిక్, క‌ట్ షాట్ ఎలా ఆడ‌తాడు? అని కాకుండా అత‌డు ఒక అద్భుతమైన బ్యాట‌ర్ గా ఎదిగిన తీరును అర్ధం చేసుకొండని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు జ‌ట్టుకోసం ఏదైనా చేసేందుకు విరాట్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడ‌ని అన్నాడు. విరాట్ ను ఎంతో గ‌మ‌నించానని అత‌డు సాధించిన రికార్డుల ప‌ట్ల ఎంతో సంతృప్తిగా ఉంటాడని ప్రశంసించాడు. జ‌ట్టు కోసం అత‌డు ఎప్పుడూ ముందుంటాడన్నారు. ప‌రుగుల సాధించాల‌నే ఆక‌లి, జ‌ట్టు కోసం దేనికైనా సిద్ధ‌ప‌డ‌డం వంటి గుణాలు స్వ‌త‌హాగా రావాలని తెలిపారు. అందుకు సీనియ‌ర్లు, మీ తోటివాళ్ల‌ను గ‌మ‌నించాలని యువ క్రికెట‌ర్ల‌కు రోహిత్ సూచించాడు.

Updated : 28 Jan 2024 4:32 PM IST
Tags:    
Next Story
Share it
Top