Home > క్రీడలు > IND vs SA: రెండేళ్ల తర్వాత టెస్టుల్లో మెరుగైన ర్యాంక్ సాధించిన కోహ్లీ

IND vs SA: రెండేళ్ల తర్వాత టెస్టుల్లో మెరుగైన ర్యాంక్ సాధించిన కోహ్లీ

IND vs SA: రెండేళ్ల తర్వాత టెస్టుల్లో మెరుగైన ర్యాంక్ సాధించిన కోహ్లీ
X

బ్యాడ్ ఫామ్ నుంచి బయటపడి సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్న విరాట్ కోహ్లీ.. ఇటీవల జరిగిన ఆసియా కప్, ఐపీఎల్, వన్డే వరల్డ్ కప్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టెస్టుల్లోనూ రాణిస్తున్న కోహ్లీ.. తాజాగా సౌతాఫ్రికా జరుగుతున్న సిరీస్ ల్లోనూ కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో కోహ్లీ ర్యాంకు మెరుగుపడింది. రెండేళ్ల తర్వాత టాప్ 10లోకి అడుగుపెట్టాడు. ఐసీసీ ప్రస్తుతం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కోహ్లీ 9వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ చివరిసారిగా 2022 మార్చిలో టాప్ 10లో ఉన్నాడు.

సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో.. 38 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 76 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులు చేశాడు. దాంతో నాలుగు ర్యాంకులు మెరుగు పరుచుకున్న కోహ్లీ.. 9 స్థానంలో నిలిచాడు. కాగా టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ 10లో ఉన్న ఒకేఒక బ్యాటర్ కోహ్లీనే కావడం గమనార్హం. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ 14వ ర్యాంక్ లో ఉన్నాడు. ఏడాది కాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న పంత్ ఇంకా 15వ స్థానంలో ఉన్నాడు. మొదటి టెస్ట్ లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ 11 స్థానాలు ఎగబాకి 51వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో నిలిచాడు. కగిసో రబాడా రెండో స్థానం, ప్యాట్ కమ్మిన్స్ మూడో స్థానంలో ఉన్నారు. జడేజా, బుమ్రా నాలుగో స్థానంలో నిలిచారు.

Updated : 3 Jan 2024 4:18 PM GMT
Tags:    
Next Story
Share it
Top