Home > క్రీడలు > Cricket in olympics: క్రికెట్ను ఒలింపిక్స్లో చేర్చడానికి కారణం.. విరాట్ కోహ్లీనే: ఒలంపిక్స్ డైరెక్టర్

Cricket in olympics: క్రికెట్ను ఒలింపిక్స్లో చేర్చడానికి కారణం.. విరాట్ కోహ్లీనే: ఒలంపిక్స్ డైరెక్టర్

Cricket in olympics: క్రికెట్ను ఒలింపిక్స్లో చేర్చడానికి కారణం.. విరాట్ కోహ్లీనే: ఒలంపిక్స్ డైరెక్టర్
X

ఓ 34 ఏళ్ల వ్యక్తి ప్రపంచ క్రికెట్ ను శాసించాడు. క్రికెట్.. ప్రపంచ నలువైపులా వ్యాప్తి చెందడానికి కారణం అయ్యాడు. రికార్డులను కొల్లగొట్టాడు. సరికొత్త చరిత్రను తిరగరాశాడు. లక్షల్లో కాదు.. కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఒక ప్లేయర్, కెప్టెన్, ఫ్రెండ్, హస్బెండ్.. ఇలా ఓ మనిషి ఎలా ఉండాలనే దానికి నిదర్శనంగా నిలిచాడు. లెజెండరీ స్థాయిని చేరుకున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతనే పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ. ఒక్క భారత్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అతనికి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. మిలియన్ల కొద్ది ఫాలోవర్లను సొంతం చేసుకుని, ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అవుతున్న, ఆదరిస్తున్న మూడో ప్లేయర్ గా నిలిచాడు. క్రికెట్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో చెప్పడానికి మరొక నిదర్శనం.. ఒలింపిక్స్. ఎందుకంటే..


123 ఏళ్ల నుంచి క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశాధి నేతలు, లెజెండరీ ఆటగాళ్లు ఒలింపిక్స్ కమిటీతో ఎన్నో చర్చల్లో పాల్గొని.. క్రికెట్ ను చేర్చాలని ప్రతిపాధించారు. వాళ్లెవరికీ సాధ్యం కానిదాన్ని విరాట్ కోహ్లీ చేసి చూపించాడు. అవును ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడానికి కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఈ మాట చెప్పింది స్వయంగా ఒలింపిక్స్ డైరెక్టరే. లాస్ ఏంజిల్స్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఇటలీ ఒలింపిక్స్ చాంపియన్ షూటర్, LA28లో స్పోర్ట్స్ డైరెక్టర్ నికోలో కాంప్రియాని ఈ విషయాన్ని పంచుకున్నాడు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) ప్రపంచ దేశాల్లో పరిశీలిస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ గురించే ఎక్కువ వినిపించిందట. అతనికున్న క్రేజ్, ఫాలోయింగ్ ను పరిగణంలోకి తీసుకుని క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చడానికి వారికి మరింత ఆసక్తి కలిగిందట. దాంతో తాజాగా జరిగిన ఐఓసీ మీటింగ్స్ తో ఏకగ్రీవ ఒప్పందానికి వచ్చి.. 2028లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ టోర్నీలో ఆరు జట్లు (పురుషులు, మహిళలు) జట్లు పాల్గొంటాయి. టీ20 ఫార్మట్ లో మ్యాచ్ లు జరుగుతాయి.






Updated : 17 Oct 2023 10:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top