Home > క్రీడలు > World cup 2023: టీమిండియాకు విరాట్ దూరం!.. ముంబై ఫ్లైట్ ఎక్కి..

World cup 2023: టీమిండియాకు విరాట్ దూరం!.. ముంబై ఫ్లైట్ ఎక్కి..

World cup 2023: టీమిండియాకు విరాట్ దూరం!.. ముంబై ఫ్లైట్ ఎక్కి..
X

వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా వార్మమ్ మ్యాచ్ లు ఆడుతుంది. రేపు నెదర్లాండ్స్ తో జరిగే రెండో వార్మప్ మ్యాచ్ కోసం భారత్ తిరువనంతపురం చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం జట్టుతో కలిసి తిరువనంతపురం రాలేదు. విరాట్ హఠాత్తుగా.. బీసీసీఐ అనుమతితో సెలవు తీసుకుని ముంబై విమానం ఎక్కాడు. అయితే అత్యవసర వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ.. ముంబై వెళ్లినట్లు తెలుస్తుంది. తాజాగా విరాట్ మరోసారి తండ్రి కాబోతున్నట్లు, అతని భార్య అనుష్క శర్మ దీనికి సంబంధించి హాస్పిటల్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

ఈ కారణంగానే విరాట్ కోహ్లీ ముంబై వెళ్లినట్లు తెలుస్తుంది. ఇటీవలే విరాట్, అనుష్క ముంబైలోని ఓ గైనకాలజిస్ట్ ను కలిశారు. 2017లో వీళ్లిద్దరి వివాహం జరుగగా.. 2021 వామిక జన్మించింది. ఇక రేపటి మ్యాచ్ కు విరాట్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ కు కూడా వాన గండం పొంచి ఉంది.




Updated : 2 Oct 2023 6:28 PM IST
Tags:    
Next Story
Share it
Top