Virat Kohli : భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ.. ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్లకు కోహ్లీ దూరం
X
భారత్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. జనవరి 25 నుంచి ప్రారంభం కాబోయే ఈ టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ రెండు టెస్టులకు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. మొదటి రెండు టెస్టులకు బీసీసీఐ ఇటీవల జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే మరో ప్లేయర్ ను సెలక్టర్లు ఎంపిక చేయాల్సి ఉంది. కాగా తొలి టెస్ట్ హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జనవరి 25న జరగనుంది.
టీమిండియా (ప్లేయింగ్ 11) : (మొదటి రెండు టెస్టులకు)
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్.
ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జో రూట్, జానీ బెయిర్‌స్టో, జాక్ క్రాలే, రెహాన్ అహ్మద్, జేమ్స్ అండర్సన్, గుస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, డాన్ లారెన్స్, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) January 22, 2024
Virat Kohli withdraws from first two Tests against England citing personal reasons.
Details 🔽 #TeamIndia | #INDvENGhttps://t.co/q1YfOczwWJ