Home > క్రీడలు > కోహ్లీ ఒక్క పోస్ట్‎ పెడితే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా.. ?

కోహ్లీ ఒక్క పోస్ట్‎ పెడితే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా.. ?

కోహ్లీ ఒక్క పోస్ట్‎ పెడితే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా.. ?
X

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. భారత్‎తో పాటు ప్రపంచవ్యాప్తంగా విరాట్ ఆటను ఆరాధిస్తారు.కెప్టెన్సీ పోయినా, ఫామ్ లో లేకపోయినా విరాట్ క్రేజ్ పెరగడం తప్ప ఎక్కడా తగ్గలేదు. కింగ్ కోహ్లి ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ఆటగాడిగా విరాట్ ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్ మరియు ట్విటర్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న క్రికెటర్ కూడా కోహ్లీయే. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అతను షేర్ చేసే ఒక బిజినెస్ పోస్ట్ కోట్ల రూపాయలను వసూలు చేస్తుందంటే అతని పవర్‌ను అర్థం చేసుకోవచ్చు

తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో గ్లోబల్ సూపర్‌స్టార్ల ఆదాయాల జాబితాలను విడుదల చేసింది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఇండియాలో అగ్రస్థానంలో, వరల్డ్ వైడ్‎గా ఐదవ స్థానంలో నిలిచాడు.

256 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న విరాట్ ఒక్క పోస్ట్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. ఇన్ స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ ఒక్క పోస్టు పెడితే రూ.11.45 కోట్లు తీసుకుంటాడని తాజా నివేదిక వెల్లడిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో క్రిస్టియానో రోనాల్డో ఉన్నాడు. రోనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టు పెడితే రూ.26.75 కోట్లు,రెండో స్థానంలో ఉన్న లియోనెల్ మెస్సీ 21.49 కోట్లు అందుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదించే వారి జాబితాలో భారత్ దేశంలో విరాట్ కోహ్లీ తరువాత బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 29 స్థానంలో ఉన్న ప్రియాంక.. ఒక్కపోస్టు ద్వారా రూ.4.40 కోట్లు వస్తాయి అయితే తాజాగా విడుదలైన జాబితాలో తొలి రెండు స్థానాలు క్రీడాకారులకే లభించాయి.


Updated : 11 Aug 2023 1:01 PM IST
Tags:    
Next Story
Share it
Top