Home > క్రీడలు > Virat kohli vs Naveen ul haq: ఐపీఎల్ ఫైట్కు శుభం.. ఐపీఎల్లో కొట్టుకుని, వరల్డ్కప్లో కలిసారు

Virat kohli vs Naveen ul haq: ఐపీఎల్ ఫైట్కు శుభం.. ఐపీఎల్లో కొట్టుకుని, వరల్డ్కప్లో కలిసారు

Virat kohli vs Naveen ul haq: ఐపీఎల్ ఫైట్కు శుభం.. ఐపీఎల్లో కొట్టుకుని, వరల్డ్కప్లో కలిసారు
X

ఓ వైపు విరాట్ కోహ్లీ భీకర్ ఫామ్.. ఆడుతుంది అతని సొంత మైదానంలో. మరోవైపు ప్రత్యర్థి ఆఫ్ఘనిస్తాన్ జట్టులో నవీన్ ఉల్ హక్ ఉన్నాడు. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత క్రికెట్ అభిమానులు కూడా వెయిట్ చేసింది ఈ సీన్ కోసమే. ఐపీఎల్ 2023లో బెంగళూరు, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన వాగ్వాదం గురించి తెలిసిందే. ఇక ఆ మ్యాచ్ నుంచి నవీన్ ఎక్కడ కనిపించినా కోహ్లీ అభిమానులు అతన్ని ట్రోల్ చేస్తూ వచ్చారు. వరల్డ్ కప్ జట్టులో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లో బాదుతుంటే.. ఆ రివేంజ్ చూసి సంతోష పడాలని భావించారు. అంతా అనుకున్నట్లే టీమిండియా- ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆఫ్ఘన్ బ్యాటింగ్ వేళ కోహ్లీ అభిమానులు రెచ్చిపోయారు. ఢిల్లీ రీసౌండ్ వచ్చేలా కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. నవీన్ ఉల్ హక్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇక మిగిలింది విరాట్ బ్యాటింగ్ కు వచ్చి తన రివేంజ్ ను తీర్చుకోవడమే.

కానీ అదేదీ జరగలేదు. నవీన్ బౌలింగ్ చేయడానికి బంతి అందుకున్నాడు. అప్పుడే విరాట్ కోహ్లీ క్రీజులో అడుగుపెట్టాడు. ఇక స్టేడియం అంతా హోరెత్తిపోయింది. కోహ్లీ.. కోహ్లీ అంటూ స్టేడియం దద్దరిల్లేలా అరిచారు. అయితే అభిమానులు అనుకున్నది ఏం జరగలేదు. కోహ్లీ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. గొప్ప ఆటగాడికి ఉండాల్సిన లక్షణాన్ని గుర్తు చేశాడు. నవీన్ ను టార్గెట్ చేసిన ప్రేక్షకులు అతన్ని తిడుతుండగా.. ‘అలా చేయొద్దు. అతన్ని ఎంకరేజ్ చేయండి’ అంటూ ప్రేక్షకులకు సైగ చేశాడు. ఆ ఒక్క సైగతో స్టేడియం సైలెంట్ అయింది. కోహ్లీని గౌరవించి నవీన్ ను ట్రోల్ చేయడం ఆపేశాడు. దాంతో ఖుష్ అయిన నవీన్.. విరాట్ కోహ్లీ దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పాడు. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు ‘అందుకే కోహ్లీని కింగ్ అన్నది. ఒక ఆటగాడికి ఉండాల్సిన లక్షణం. సాటి మనిషిగా ఉండాల్సిన స్వభావం అన్నీ అతనిలో ఉన్నాయి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరు డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం రివేంజ్ తీర్చుకుంటూ బాగుండేదని కోరుకుంటున్నారు.


Updated : 12 Oct 2023 10:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top