India vs Australia: టీమిండియాకు ఇదే చివరి అవకాశం.. లేదంటే?
X
"టీమిండియా, ఆస్ట్రేలియా మరో సమరానికి సిద్ధం అయ్యాయి." (India vs Australia) రాజ్ కోట్ వేదికగా చివరి వన్డే జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్ సిరీస్ ను కైవసం చేసుకోగా.. చివరి మ్యాచ్ లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. ఇక ఆసీస్ ప్లేయర్లు లోపాలను సరిదిద్దుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ భారత్ కు చివరి అవకాశం కానుంది. ఈ మ్యాచ్ అయిపోతే వరల్డ్ కప్ లోకి అడుగుపెడుతుంది. వార్మప్ మ్యాచ్ లు జరుగుతాయి. కాగా భారత్ టీంలో ఏదైనా ప్రయోగం చేయాలంటే ఇదే చివరి మ్యాచ్ అవుతుంది. ఇప్పటికే ప్రతీ ప్లేయర్ ఫామ్ లోకి రావడం జట్టుకు శుభవార్త. ఇక చివరి మ్యాచ్ లో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, సిరాజ్ బరిలోకి దిగుతారు. ఆసీస్ కూడా పూర్తి స్థాయి జట్టుతో ఆడుతుంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరం కానుంది. ఈ మ్యాచ్ అయిపోతే సెప్టెంబర్ 30 ఇంగ్లండ్ తో, అక్టోబర్ 3న నెదర్లాండ్స్ తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
ఆ ఇద్దరితో..:
"రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఆస్ట్రేలియాపై వన్డేల్లో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి." రోహిత్ ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 2251 రన్స్ చేయగా.. సగటు 59తో 8 సెంచరీలు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇక కోహ్లీ 53 సగటుతో 2172 రన్స్ చేయగా.. అందులో 8 సెంచరీలు ఉన్నాయి. ఇవాళ జరిగి మ్యాచ్ లో ఈ ఇద్దరిలో ఎవరు రాణిస్తారో చూడాలి. ఇద్దరిట్లో ఎవరు క్లిక్ అయినా ఆసీస్ కు చుక్కలే.