Home > క్రీడలు > IND vs NZ: బ్యాటింగ్లో కొత్త షాట్లు నేర్చుకుంటున్నా: విరాట్ కోహ్లీ

IND vs NZ: బ్యాటింగ్లో కొత్త షాట్లు నేర్చుకుంటున్నా: విరాట్ కోహ్లీ

IND vs NZ: బ్యాటింగ్లో కొత్త షాట్లు నేర్చుకుంటున్నా: విరాట్ కోహ్లీ
X

విరాట్ కోహ్లీకి ఎందుకు అంతమంది ఫ్యాన్స్ అంటే.. అతని క్లాస్ బ్యాటింగ్, టైమింగ్ షాట్స్ అద్భుతంగా ఉంటాయి కాబట్టి. ఫీల్డర్ ముందు నుంచి కవర్ డ్రైవ్ లు కొట్టడంతో దిట్ట. అయితే అవేవీ కాలం మారుతున్నప్పుడు పనిచేయవు అని అంటున్నడు విరాట్. క్రికెట్ లో పరిపూర్ణమైన ఆటగాడిగా ఎదుగుతున్నకొద్దీ.. కొత్త షాట్లు ఆడటం నేర్చుకోవాలి అంటున్నాడు. ‘టెక్నిక్, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటేమే నేర్చుకున్న టెక్నిక్ ను మ్యాచ్ లో గెలవడానికి ఉపయోగిస్తే.. రెండోది బ్యాటింగ్ మెరుగుపడటానికి వాడటం. ఈ విషయంలో చాలామందికి అవగాహన ఉండదు. మన బ్యాటింగ్ స్టైల్ కు ఇంకా ఏం చేరిస్తే బాగుంటుందో ఆలోచించాలి. దాంతోనే పరిపూర్ణమైన బ్యాటర్ గా వృద్ధి చెందుతాం. కొత్త షాట్లు నేర్చుకోవాలి. దాంతోనే పరుగులు రాబట్టగలుగుతాం’అని విరాట్ చెప్పుకొచ్చాడు.

‘బ్యాటర్ క్రికెట్ లో ఎదుగుతున్న కొద్దీ అతని బ్యాటింగ్ స్టైల్ అందరికీ అర్థం అవుతుంది. వీక్ నెస్ తెలిసిపోతుంది. దాంతో త్వరగా ఔట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే నేను కొత్త షాట్లు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా. టీ20 వరల్డ్ కప్ లో హరీస్ రౌఫ్ బౌలింగ్ లో కొట్టిన షాట్ ఎలా ఆడానో నాకే తెలియదు’అని చెప్పాడు. కాగా న్యూజిలాండ్ తో సెమీస్ పోరు ఖాయం అయిన సందర్భంగా.. శుక్రవారం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిక కోహ్లీ ఎక్కువగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల బౌలింగ్ లోనే ఆడాడు. 2021లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బౌలింగ్ లో కోహ్లీ సగటు 13 మాత్రమే. అందుకే కీలక పోరు ముందు బ్యాటింగ్ లో శ్రమిస్తున్నాడు కోహ్లీ.

Updated : 11 Nov 2023 9:58 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top