Virat Kohil : టీమిండియాకు కోహ్లీ ప్రశంసలు.. మరి ఐదో టెస్టులో ఆడతాడా లేదా
X
రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ పై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. సీనియర్లు లేకపోయినా.. పట్టుదల, దృడ సంకల్పంతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించారు టీమిండియా కుర్రాళ్లు. నాలుగో ఇన్నింగ్స్ లో 192 పరుగులను చేదించే క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టినా.. పట్టుదలగా ఆడి గెలిపించారు. ఈ విజయంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘మన యంగ్ టీమిండియా అద్భుతం చేసింది. ఒత్తిడి జయించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. పట్టుదల, సంకల్పం, కఠిన పరిస్థితులను ఎదుర్కొనే దృఢత్వాన్ని కుర్రాళ్లు ప్రదర్శించారు’ అని కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
కాగా అనుష్క, కోహ్లీ దంపతులు ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ కారణంగా.. కోహ్లీ ఈ సిరీస్ కు దూరంగా ఉన్నాడు. అయితే ధర్మశాలలో జరిగే చివరి టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. గాయం కారణంగా కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యారు. నాలుగో టెస్టుకు బుమ్రాకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది.