విండీస్ బౌలర్‌పై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు..స్టంప్ మైక్‌లో రికార్డు
X
డొమినికాలో వెస్టిండీస్‌తో జరుగుతున్న భారత్ తొలి టెస్ట్‌లో పట్టు బిగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, జైశ్వాల్ సెంచరీలతో చెలరేగారు. రోహిత్ వెనుదిరిగినా జైశ్వాల్ మాత్రం డబుల్ సెంచరీపై కన్నేశాడు. మరో ఎండ్‌లో విరాట్ నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు ఎదర్కొన్న 81వ బంతికి మొదటి బౌండరీ బాదాడంటే కోహ్లీ బ్యాటింగ్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
రెండో రోజు ఆట సందర్భంగా కోహ్లీ విండీస్ కెప్టెన్ బౌలింగ్ పై అసహనం వ్యక్తం చేశారు. యశస్వి జైశ్వాల్ తో కోహ్లీ మాట్లాడుతూ... బ్రాత్‌వైట్ ఇటుకలు విసిరినట్లుగా బౌలింగ్ చేస్తున్నాడు అని వ్యాఖ్యానించాడు. కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మైక్ స్టంప్‌లో రికార్డయ్యాయి. అయితే బ్రాత్‌వైట్ బౌలింగ్ యాక్షన్‌పై మాత్రం భారత బ్యాటర్లు ఎవరికీ ఫిర్యాదు మాత్రం చేయలేదు. బ్రాత్ వైట్ బౌలింగ్ పై గతంలోను అనుమానాలు తలెత్తాయి. 2019లో విండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు భారత అటగాళ్లు ఇలాంటి ఆరోపణలు చేశారు. 2017లో కూడా అతడి యాక్షన్‌పై ఐసీసీకి ఫిర్యాదులు అందాయి. ఐసీసీ మాత్రం బ్రాత్ వైట్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నట్లు స్పష్టం చేసింది.
మ్యాచ్ విషయానికొస్తే ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 312/2 స్కోర్ చేసింది. యశస్వి జైశ్వాల్ 143, విరాట్ 36 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ 103, శుభమన్ గిల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు చేతులెత్తేసింది.