కోహ్లీ కారణంగానే తిరిగి జట్టులోకి వచ్చా : యువరాజ్
X
యువరాజ్‌సింగ్..క్రికెట్ ప్రేమికులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 2 దశాబ్దాల పాటు భారత్ జట్టుకు సేవలందించాడు. క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్‌ది ప్రత్యేక స్థానం. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టీమిండియే గెలిదంటే యువీయే ప్రధాన కారణం అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన అసాధరణ ఆటతో అందని ద్రాక్షలా ఉన్న రెండు ప్రపంచకప్‌లను అందించాడు.
అప్పటివరకు రారాజుగా వెలిగిన యువీ కెరీర్ తలక్రిందులైంది. 2011 ప్రపంచకప్ ముగిసిన కొన్ని రోజులకు క్యాన్సర్ గురయ్యాడు. దీంతో యువీ కెరీర్ ముగిసనట్లే అని అంతా భావివంచారు. కానీ యువీ క్యాన్సర్‌ను జయించి మళ్లీ బ్యాట్ పట్టాడు. 2015 ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచ కప్‌లలో చోటు ఆశించినా నిరాశ ఎదురైంది. అనంతరం దేశవాళీ క్రికెట్‌లో రాణించి 2017 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తిరిగి జట్టులో చోటు సంపాదించుకున్నాడు.
ఆనాటి పరిస్థితులను తాజాగా గుర్తు చేసుకున్న యువీ తాను తిరిగి జట్టులోకి వచ్చినప్పుడు అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడని తెలిపాడు. కోహ్లీ సపోర్ట్ లేకపోతే జట్టులోకి వచ్చేవాడిని కాదన్నాడు. 2019 ప్రపంచకప్‌కు సెలెక్టర్లు ఎంపిక చేయని విషయాన్ని యువరాజ్ గుర్తు చేసుకున్నాడు. ఎంపిక చేయకపోవడానికి కారణాలను ధోని తనకు వివరించినట్లు తెలిపాడు.
2011 ప్రపంచకప్ వరకు తనపై ధోనీ చాలా నమ్మకంతో ఉన్నాట్లు యువరాజ్ చెప్పాడు. ‘‘నువ్వే నా ప్రధాన ప్లేయర్‌వి.. గుర్తుపెట్టుకో’’ అని చెప్పేవాడు. కానీ 2015 ప్రపంచకప్ నాటికి పరిస్థితులు మారిపోయాయి" అని వివరించాడు. ఓ ఇంటర్వ్యూలో చెప్పిన యువీ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.