Home > క్రీడలు > జిమ్‌లొ వర్కవుట్స్... చెమటలు చిందిస్తున్న కోహ్లీ

జిమ్‌లొ వర్కవుట్స్... చెమటలు చిందిస్తున్న కోహ్లీ

జిమ్‌లొ వర్కవుట్స్... చెమటలు చిందిస్తున్న కోహ్లీ
X

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో భారత స్టార్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులతో పాటు భారత జట్టు ఛేజింగ్ మాస్టర్, రన్ మెషీన్‌గా ప్రసిద్ధి చెందాడు. 19 ఏళ్ల వయసులో భారత జట్టుతో తన కెరీర్‌ను ప్రారంభించిన 4 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడి మాదిరే పాదరసంలా గ్రౌండ్‌లో కదులుతుంటాడు. ఈ తరంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా తన పేరును నిలబెట్టుకున్న కోహ్లీ.. తనకొచ్చిన రివార్డులు, అవార్డులు, ప్రశంసలను ఏ మాత్రం నెత్తికెక్కించుకోడు. నిరంతరం పర్ఫెక్షన్ కోసం పనిచేస్తూ.. తనకు తానుగా కొత్త సవాళ్లను సెట్ చేసుకుంటాడు.

ప్రస్తుతం జట్టులో అందరి కంటే ఎక్కువ ఫిట్‌గా ఉండే ప్లేయర్లలో కోహ్లీనే ముందుంటాడు. నిత్య జిమ్‌లో కష్టపడుతూ.. సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు తనకు తాను మెరుగులు దిద్దుకుంటాడు. తాజాగా జిమ్‌లో చెమటలు చిందిస్తున్న పిక్స్‌ను కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒక పిక్‌లో జిమ్ ట్రైనర్ సాయంతో వర్కౌట్స్ చేస్తున్నాడు. మరో పిక్‌లో ఒంటరిగా కష్టపడుతున్నాడు. "ప్రతి రోజూ కాలు కదుపుతూ ఉండాలి.. ఎనిదేళ్లుగా కౌంటింగ్." అంటూ కోహ్లీ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోలపై కోహ్లీ ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది విరాట్ కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఐదు 5 టెస్టు మ్యాచ్‌ల్లో ఆడగా.. 8 ఇన్నింగ్స్‌లలో 45 సగటుతో 360 పరుగులు చేశాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14, రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేశాడు.

ప్రస్తుతం టీమిండియా విండీస్‌ టూర్‌లో ఉంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 12న మొదటి టెస్టుతో భారత పర్యటన మొదలుకానుంది. తొలి మ్యాచ్ డొమినికా వేదికగా జరగనుంది. ఈ సిరీస్‌తో భారత్ డబ్ల్యూటీసీ సైకిల్‌ను మొదలు పెట్టనుంది. ఇప్పటికే కరేబియన్ గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు.. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వెస్టిండీస్‌పై సిరీస్ విజయం సాధించి.. ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్‌లో త్వరగా మర్చిపోవాలని భావిస్తోంది. టెస్టులు, వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. టీ20లకు హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ విశ్రాంతినిస్తున్న విషయం తెలిసిందే.


Updated : 9 July 2023 10:20 AM IST
Tags:    
Next Story
Share it
Top