Home > క్రీడలు > విండీస్ దూకుడుకు బ్రేక్.. సూపర్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ

విండీస్ దూకుడుకు బ్రేక్.. సూపర్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ

విండీస్ దూకుడుకు బ్రేక్.. సూపర్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ
X

‘అతని పని అయిపోయింది. టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చి.. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడితే బాగుంటుంది. అతని ప్లేస్ లో యంగ్ స్టర్స్ వస్తారుగా. రిటైర్ అయిపోతే బాగుంటుంది. ఫామ్ లేని వాడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు. విరాట్ టీమిండియాకు భారం అయ్యాడు. పుజారాలాగ సైడ్ చేయండి’.. ఇవి వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు ముందు విరాట్ కోహ్లీపై విమర్శకుల మాటలు. ఫామ్ పోయింది అన్నా.. కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పిన వాళ్ల ముక్కున వేలేసుకునేలా టెస్టుల్లో తన 29వ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్ తో అంతర్జాతీయ క్రికెట్ లో 76 సెంచరీలు సాధించాడు కోహ్లీ. విండీస్ పై కోహ్లీకిది 12 సెంచరీ. అంతేకాకుండా 500 అంతర్జాతీయ మ్యాచ్ లో సెంచరీ చేసిన అరుదైన రికార్డ్ ను విరాట్ సొంతం చేసుకున్నాడు.

క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ లో విండీస్ బౌలర్ల దూకుడుకు బ్రేక్ వేసి.. సెంచరీ బాదాడు. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని కొనసాగిస్తూ.. తోటి బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరుతున్నా క్రీజులో పాతుకు పోయాడు. 180 బంతుల్లో 102 పరుగులు చేసి సలాం అనిపించుకున్నాడు. రోహిత్ శర్మ (80), శుభ్ మన్ గిల్ (10), రహానే (8) త్వరగానే ఔట్ అయినా.. తర్వాత వచ్చిన బ్యాటర్ జడేజాతో (48) ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. దీంతో రెండో రోజు మొదటి సెషన్ లోనే టీమిండియా భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, షానన్ గాబ్రిల్, వారికన్, హోల్డర్ చెరో వికెట్ పడగొట్టారు.


Updated : 21 July 2023 2:58 PM GMT
Tags:    
Next Story
Share it
Top