కోహ్లీ కొత్త ఇయర్ బడ్స్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే ?
X
తమ అభిమాన నటలు, సెలబ్రిటీలు, క్రికెట్ దిగ్గజాలు వేసుకునే దుస్తులు, బ్యాగులు, చెప్పులు వాడే ఎలక్ట్రానిక్ పరికరాల గురించి తెలుసుకోవాలని అభిమానులు తహతహలాడుతుంటారు. వాటి ధరెంతో, అవి ఎక్కడ లభిస్తాయో వంటి వివరాలను తెలుసుకోవాలనుకుంటారు. ఇక క్రికెటర్ల అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ క్రికెటర్ 'విరాట్ కోహ్లీ'కి మూమూలు ఫోలోయింగ్ ఉండదు. ఈ మధ్యనే వెస్టిండీస్ టూర్‌కు వెళ్లిన విరాట్ అక్కడ అత్యంత ఖరీదైన ఇయర్‌బడ్స్ పెట్టుకుని అందరిని అట్రాక్ట్ చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఇయర్ బడ్స్ గురించే టాక్ నడుస్తోంది.
విరాట్ కోహ్లీకి సంబంధించి ప్రతి రోజూ ఏదో ఓ వార్త నెట్టింట్లో ప్రత్యక్షమవుతుంటుంది. తాజాగా ఆయన ఉపయోగించే ఇయర్ బడ్స్ ఇప్పుడు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు.అందుకు కారణం లేకపోలేదు విరాట్ కోహ్లీ అత్యంత ఖరీదైన బీట్స్ పవర్‌బీట్స్ ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ని వాడుతున్నారు. దీని ధర రూ. 249.95 డాలర్లు అంటే రూ. 20వేల వరకు ఉంటుందని సమాచారం. సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు యాపిల్ ఇయర్‌బడ్స్ వాడతారు. కానీ కోహ్లీ స్పెషల్‌గా వేరే బ్రాండ్ ఉపయోగిస్తున్నారు. అయితే ఇయర్‌బడ్స్ భారత్‌లో అందుబాటులో లేవని సమాచారం. ఈ ఇయర్ బడ్స్ కేవలం యూఎస్‌లో లేదా
ఆన్లైన్లో మాత్రమే లభిస్తున్నాయి.
కోహ్లీ వెస్టిండీస్ టూర్లో వికెట్ కీపర్ 'జాషువా డా సిల్వా' తల్లిని కలిశారు. ఆమెను ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో విరాట్ ఇయర్ బడ్స్ పెట్టుకున్నారు. అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
Earbuds, Virat Kohli, West Indies Tour, not available in India, India, cricket, star cricketer, wicket keeper, Rs 20,000, Beats Powerbeats Pro TWS, america, online store