Virat Kohli Retirement..? : క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్? ఇది నిజమేనా..?
X
ఇండియన్ క్రికెట్లో మంచి ఫామ్‌లో ఉన్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ. మూడు పదుల వయసులోనే సెంచరీల మీద సెంచరీలు కొడుతూ అభిమానుల మనసు దోచుకుంటున్నాడు (Virat Kohli Retirement..?) కోహ్లీ. ఇండియా వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవాలంటే విరాట్ రాణింపు అత్యంత కీలకంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా మాజీ సౌత్ ఆఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కోహ్లీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. త్వరలోనే విరాట్ కోహ్లీ రిటైర్ అవుతాడంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లీ రిటైర్ అవ్వాలని డిసైడ్ అయితే..ప్రపంచ కప్ పూర్తైన వెంటనే నిర్ణయం తీసుకోవాలని అదే బెస్ట్ టైం అని డివిలియర్స్ తెలిపాడు. డివిలియర్స్ కామెంట్స్‌తో కోహ్లీ అభిమానులు ఒక్కసారిగా కన్ఫ్యూజన్లో పడిపోయారు. అప్పుడే కోహ్లీ పదవీవిరమణ కావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సచిన్ సెంచరీల రికార్డును బ్రేక్ చేయకుండానే కోహ్లీ ఎలా రిటైర్ అవుతారంటూ నిలదీస్తున్నారు.
ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డే మ్యాచ్‌లకు బ్రేక్ తీసుకున్నవిరాట్ మూడో వన్డే ఆడబోతున్నాడు. మ్యాచ్ నేపథ్యంలో ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సమయంలో కోహ్లీ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ ఈ సంచలన కామెంట్స్ చేశాడు. ఇండియన్ టీమ్ వన్డే వరల్డ్ కప్ సాధిస్తే కోహ్లీ రిటైర్ అవుతాడా? అని కొంత మంది జర్నలిస్టులు ఏబీడీని క్వశ్చన్ చేశారు. దీనికి సమాధానంగా కోహ్లీ రిటైర్ అవ్వాలంటే ఇదే బెస్ట్ టైం అని డివిలియర్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. "కోహ్లీ ఫిట్‌నెస్ ఫ్రీక్. అతను సౌత్ ఆఫ్రిక్రాలో జరిగే వన్డే వలర్డ్ కప్ మ్యాచ్ కూడా ఆడగలడు. అది నాకు తెలుసు. అయితే కోహ్లీ రిటైర్మెంట్‌కు ఇంకా సమయం ఉంది. ఇప్పుడు అందరి ఫోకస్ భారత్‌లో జరిగే వలర్డ్ కప్‌పైనే ఉంది. ఈ ప్రశ్న కోహ్లీని అడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది"అని డివిలియర్స్ తెలిపాడు.