IND vs AUS: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన కోహ్లీ’.. ఓదార్చిన అనుష్క శర్మ
X
వరల్డ్ కప్ మొత్తంలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను ముందుంది నడిపించాడు విరాట్ కోహ్లీ. 12 మ్యాచుల్లో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో మొత్తం 765 పరుగులు చేశాడు. 95.62 సగటుతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నలిచాడు. జట్టుకు అవసరమైన ప్రతీ సమయంలో వెన్నెముకలా నిలబడ్డాడు. జట్టు భారీ పరుగులు చేయడానికి పునాదులు వేశాడు. కాగా 2003 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు (673) చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. లీగ్ దశలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా.. సెమీస్ లో న్యూజిలాండ్ జట్లపై సెంచరీలు చేశాడు. కాగా వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. పలువురు ఆటగాళ్లు గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సిరాజ్, కేఎల్ రాహుల్ కంటతడిపెట్టుకోగా.. సహచర ఆటగాళ్లు వీరిని ఓదార్చారు. కోహ్లీ భార్య అనుష్క శర్మ అతన్ని హత్తుకుని ధైర్యాన్నిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.