Home > క్రీడలు > విరాట్ కోహ్లీకి ఇన్ని కోట్ల ఆస్తులా..!

విరాట్ కోహ్లీకి ఇన్ని కోట్ల ఆస్తులా..!

విరాట్ కోహ్లీకి ఇన్ని కోట్ల ఆస్తులా..!
X

విరాట్ కోహ్లీ...ప్రపంచ క్రికెట్ దిగ్గజాలలో ఒకడు. ఒంటి చేత్తో భారత్‌కు ఎన్నోచిర్మస్మరణీయ విజయాలను అందించాడు. తన ఆటలోనే కాదు..మాటల్లోనూ విరాట్‌కు దూకుడెక్కువ.ఈ ఆటిట్యూడ్‌తో కూడా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మోస్ట్ పాపులర్ కీడాకారుల్లో ఒకడిగా నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్ లోనే కోహ్లీకి 252 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉండడం విశేషం.ఇంత పాపులారిటీ సంపాదించుకున్న విరాట్ ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. అతడి నికర ఆస్తుల విలువ రూ.1050 కోట్లు అని ‘స్టాక్‌ గ్రో’(Stock Gro) సంస్థ వెల్లడించింది. ఓ క్రికెటర్ ఇంత సంపాదించడం సాధరణ విషయం కాదు. అసలు విరాట్ ఆస్తులు, తన సంపాదన మార్గాలపై ఓ లుక్కేద్దాం.

బీసీసీఐ ‘A+’ కాంట్రాక్ట్‌ కలిగిన విరాట్ ఏడాదికి రూ.7 కోట్లు ఆర్జిస్తాడు. ప్రతి టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు లభిస్తాయి. ఇక ఐపీఎల్‌ ద్వారా ఆర్సీబీ జట్టుకు ఆడటం ద్వారా అతడు ఏడాదికి రూ.15 కోట్లు పొందుతాడు.

సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ కోహ్లీ సొంతం. 252 మిలియన్లు ఫాలోవర్స్ కలిగిన విరాట్..ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు రూ.8.9 కోట్లు ఛార్జ్‌ చేస్తాడు. ట్విట్టర్‌లో లో ఒక్కో పోస్టుకు రూ.2.5 కోట్లు తీసుకుంటాడు. అదే విధంగా కింగ్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా 18 బ్రాండ్ల తమ ప్రచారకర్తగా నియమించుకున్నాయి. ఈ ఒక్కో యాడ్స్‌లో నటించేందుకు రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్లు వసూలు చేస్తాడు. కేవలం వాటి ద్వారానే ఏడాదికి రూ.175 కోట్లు విరాట్ జేబులో పడతాయి.

కోహ్లీకి రూ.34 కోట్ల విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ముంబయిలో, రూ.80 కోట్ల విలువ చేసే మరో నివాసం గురుగ్రామ్‌లో ఉంది.రూ.31 కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. కోహ్లీకి సొంతంగా చాలా బ్రాండ్లు ఉన్నాయి. బ్లూట్రైబ్‌, యూనివర్సల్‌ స్పోర్ట్స్‌బిజ్‌, ఎంపీఎల్‌, స్పోర్ట్స్‌ కాన్వో లాంటి ఏడు స్టార్టప్స్‌లో అతడు పెట్టుబడి పెట్టాడు. కోహ్లీకి ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్‌ క్లబ్‌, ఓ టెన్నిస్‌ జట్టు, ప్రో రెజ్లింగ్‌ జట్టు ఉన్నాయి. వీటి ద్వారా కూడా భారీగానే ఆదాయం సమకూరుతోంది.

Updated : 18 Jun 2023 4:24 PM IST
Tags:    
Next Story
Share it
Top