Home > క్రీడలు > డీప్ ఫేక్ బారినపడ్డ కోహ్లీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

డీప్ ఫేక్ బారినపడ్డ కోహ్లీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

డీప్ ఫేక్ బారినపడ్డ కోహ్లీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రముఖుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన సచిన్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ గేమింగ్ యాప్ సచిన్ ముఖాన్ని మార్ఫింగ్ చేసి.. ప్రమోట్ చేస్తుంది. దీనిపై సచిన్ సోషల్ మీడియా వేదికగా స్పందించి.. ఆ వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. తాజాగా మరో సెలబ్రెటీ డీప్ ఫేక్ బారిన పడ్డాడు. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ బెట్టింగ్ యాప్ ను కోహ్లీ ప్రమోట్ చేస్తున్నట్లు ఉండటం గమనార్హం.

ఓ ప్రముఖ టీవీ చానల్ లైవ్ లో కోహ్లీ యాడ్ ప్రసారం అవుతున్నట్లు కేటుగాళ్లు మార్ఫింగ్ చేశారు. గతంలో కోహ్లీ ఇంటర్వ్యూ వీడియోతో ఈ డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు. అందులో కోహ్లీ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్లు ఉంది. తక్కువ పెట్టుబడి, సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై కోహ్లీ ఇంకా స్పందించలేదు.



Updated : 20 Feb 2024 7:01 PM IST
Tags:    
Next Story
Share it
Top