సన్‌రైజర్స్ హెడ్‌కోచ్‌గా వీరేంద్ర సెహ్వాగ్ ?
X
గత మూడు సీజన్లలో ఐపీఎల్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. IPL - 2020 నుంచి ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ కనిపిస్తుందంటే ఆ టీమ్ ప్లాప్ షోను అర్థం చేసుకోవచ్చు. కోట్ల రూపాయలు పెట్టి ప్లేయర్స్‌ను కొనుగోలు చేసినా, కెప్టెన్లను మార్చినా సన్ రైజర్స్ కథ మారలేదు. దీంతో కీలక నిర్ణయం తీసుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సిద్ధమైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపురి సీజన్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కొత్త ప్రధాన కోచ్ కోసం చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత కోచ్ బ్రియాన్ లారా పనితీరుపై SRH యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని తప్పించి కొత్త కోచ్ వేటను మొదలు పెట్టేసింది. ఇప్పటికే కోచ్ కోసం పలువురు మాజీ ఆటగాళ్లను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఎస్‌ఆర్‌హెచ్ (SRH) హెడ్‌కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ ఓపెనర్‌ను వీరేంద్ర సెహ్వాగ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అతడు ఇంకా దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో సెహ్వాగ్ సమాధానం కోసం వేచిచూస్తోంది. గతంలో సెహ్వాగ్ పంజాబ్ కింగ్స్‌కు మెంటార్‌గా నాలుగు సీజన్ల పాటు పనిచేశాడు. ఐపీఎల్‌లో ఆటగాడిగా కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. దీంతో అతడికే కోచింగ్ పగ్గాలు అప్పజెప్పాలని ఎస్‌ఆర్‌హెచ్ భావిస్తోంది. సెహ్వాగ్‌తో పాటు కొత్త కోచ్ రేసులో ఆండీ ఫ్లవర్, మరో విదేశీ ఆటగాడు ఉన్నట్లు సమాచారం. కానీ అభిమానులు మాత్రం డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి 2009లో టైటిల్ అందించిన ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ని హెడ్ కోచ్‌గా నియమిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.