Home > క్రీడలు > టీమిండియాకు మంచిరోజులొచ్చాయ్.. టీం సెలక్టర్గా సెహ్వాగ్..!

టీమిండియాకు మంచిరోజులొచ్చాయ్.. టీం సెలక్టర్గా సెహ్వాగ్..!

టీమిండియాకు మంచిరోజులొచ్చాయ్.. టీం సెలక్టర్గా సెహ్వాగ్..!
X

బీసీసీఐ రానున్న రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. ఆటగాళ్లు, కెప్టెన్, కోచ్, సెలక్టర్లు.. ఇలా అన్ని విభాగాల్లో ప్రక్షాళణ మొదలుపెట్టింది. వచ్చే ఐసీసీ ట్రోఫీల్లో ఏదైనా కప్పు తప్పక గెలవాల నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. ఇంకో వారం రోజుల్లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. షెడ్యూల్ ప్రకారం రోజులు దగ్గర పడుతున్నా.. టీమిండియా జట్లను మాత్రం ప్రకటించలేదు. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న పురుషుల జట్టు సెలక్షన్ ప్యానెల్ పూరించేందుకు.. సెలక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.

చేతన్ శర్మ రాజీనామాతో చైర్మన్ పోస్ట్ ఖాళీ అయింది. దీంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 30వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా దరఖాస్తు చేసుకోవచ్చని బీసీసీఐ ప్రకటించింది. దీనికోసం అభ్యర్థులకు కావాల్సిన క్వాలిఫికేషన్ ను నోటీస్ లో స్పష్టంగా తెలిపింది. అయితే, చైర్మన్ పదవి రేసులో వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పురుషుల జట్టు సెలక్షన్ ప్యానల్ పై శివ సుంద‌ర్ దాస్, సుబ్రతో బెన‌ర్జీ, స‌లీల్ అంకోలా, శ్రీ‌ధ‌ర‌న్ శ‌ర‌త్ ఉన్నారు.


Updated : 22 Jun 2023 4:42 PM GMT
Tags:    
Next Story
Share it
Top