వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్లు సెమీస్‌కు చేరుతాయి :సెహ్వాగ్
X
షెడ్యూల్ విడుదల కావడంతో వరల్డ్ కప్ సందడి నెలకొంది. ఈ సారి భారత్ వేదికగా జరుగుతుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్ విన్నర్ ఎవరు అన్నదానిపై చర్చ కూడా మొదలైంది. ఈ సారైన స్వదేశంలోప్రపంచకప్‌ను ముద్దాడాలని ఆశిస్తున్నారు.
అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ ప్రారంభం కాబోతోంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 15న భారత్, పాకిస్థాన్ మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబర్ 19న నిర్వహించనున్నారు.
2023 ప్రపంచకప్‌పై ప్రధాన జట్లన్నీ భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటినుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అయితే ప్రపంచకప్ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ కు వెళ్లే అవకాశాలు ఏ జట్లకు ఎక్కువగా ఉన్నాయి? అన్న దానిపై ఎక్కువ మందిలో ఆసక్తి నెలకొంది. దీనిపైనే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్ జట్లకు సెమీస్‌కు వెళ్లే అవకావం ఉందని సెహ్వాగ్ తెలిపాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇటీవల అద్భుతంగా ఆడుతున్నారని వారి కచ్చితంగా సెమీస్‌కు చేరుతారని సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆ రెండు జట్లతో పాటు భారత్, పాక్‌లు కూడా చేరుకోవచ్చన్నాడు. సెహ్వాగ్ జోష్యం ఎంతవరకు కరెక్టో తెలుసుకోవాలంటే మరో 4 నెలలు ఆగాల్సిందే.