Home > క్రీడలు > సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న వీరేంద్ర సెహ్వాగ్

సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న వీరేంద్ర సెహ్వాగ్

సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న వీరేంద్ర సెహ్వాగ్
X

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సినిమాలకు మన దేశంలో కొంచెం క్రేజ్ ఎక్కువే. ముఖ్యంగా క్రికెట్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. లగాన్, సచిన్, ధోని, జెర్సీ వంటి చిత్రాలు భాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. తాజాగా క్రికెట్ కథ తెరకెక్కిన చిత్రం ఘూమ‎ర్‌. కుడి చేయి లేని ఓ అమ్మాయి ఎలా లెఫ్టామ్ స్పిన్నర్‎గా ఎలా ఎదుగుతుంది అనేది ఈ చిత్రం సారాంశం. సయామీ ఖేర్ ఆ పాత్ర పోషించగా.. ఆమె కోచ్ గా అభిషేక్ కనిపించాడు. అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్‌లో అలరించాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఘామర్ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది.

నిన్న పలువురు ప్రముఖల కోసం ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఇక ఈ సినిమా ప్రీమియర్ చూసిన టీమ్ఇండియా మాజీ బ్యాట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా సోష‌ల్ మీడియాలో స్పందించాడు. ఘామర్ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా సినిమా చూసి తాను కన్నీరు పెట్టుకున్నట్లు వెల్లడించాడు. క్రికెట్‌తో భావోద్వేగంతో సినిమాను తెరకెక్కించారని చెప్పాడు.

"నిన్న నేను ఘూమర్ సినిమా చూశాను. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత క్రికెట్ సినిమా చూడటంలో ఆనందం కలిగింది. ఎందుకంటే ఇందులో క్రికెట్ తో పాటు ఎమోషన్ ఉంది.

ఓ క్రీడాకారుడు పడే కష్టాన్ని చూపించారు. ముఖ్యంగా గాయం తర్వాత తిరిగి ఆడాలంటే ఎంతగా శ్రమించాలో తెలుస్తుంది" అని సెహ్వాగ్ ఓ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోను అమితాబ్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఎంతో సాధారణ భాషలో ఎంతో పెద్ద విషయం సెహ్వాగ్ చెప్పాడంటూ బిగ్ బీ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

అయితే వీరు వీడియోపై అమితాబ్ బచ్చన్‌కు కూడా స్పందించాడు. వీరూ పాజీ నువ్వు చాలా గొప్పవాడివి నిన్న ఘూమర్‌ ప్రీమియర్‌లో మిమ్మల్ని కలవడం గొప్పగా అనిపించింది. మీ ఎంకరేజ్‌మెంట్ మాకు చాలా ముఖ్యం. అమితాబ్ గారు చెప్పినట్టు నాకు క్రికెట్‌తో పాటు మీరు అన్న చాలా ఇష్టం అని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశాడు.


Updated : 18 Aug 2023 2:21 PM IST
Tags:    
Next Story
Share it
Top