Home > క్రీడలు > IND vs AUS: ఆంధ్రాలో భారీ వర్షాలు.. మొదటి టీ20 జరుగుతుందా?

IND vs AUS: ఆంధ్రాలో భారీ వర్షాలు.. మొదటి టీ20 జరుగుతుందా?

IND vs AUS: ఆంధ్రాలో భారీ వర్షాలు.. మొదటి టీ20 జరుగుతుందా?
X

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓటమికి బదులు తీర్చుకునే టైమొచ్చింది. వచ్చే ఏడాది జూన్ లో జరుగనున్న టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్ లకు రంగం సిద్ధం అయింది. విశాఖపట్నం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లకు ఈ సిరీస్ లో రెస్ట్ ఇచ్చారు. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా జట్టుకు దూరం అయ్యాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి కప్పుకొట్టిన ఆసీస్ ను భారత కుర్రాళ్లు ఎలా ఎదురుకుంటారో చూడాలి. టీమిండియా అభిమానులు కూడా ఓటమికి బదులు తీర్చుకోవాలని ఆశిస్తున్నారు. అంతా బాగనే ఉన్నా ఇవాళ జరిగే మ్యాచ్ కు వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల.. గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఇవాళ విశాఖలో వర్షం కురిసే అవకాశం 63 శాతం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, కానీ అదృష్టవశాత్తు సాయంత్రం ఎటువంటి వర్షం సూచన లేదని చెప్పింది. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ సారద్యంలో పూర్తి కుర్రాళ్లతో కూడిన జట్టు బరిలోకి దిగుతుంది. సీనియర్లు, జూనియర్లతో ఆసీస్ కూడా పటిష్టంగా కనిపిస్తుంది. కాగా రాత్ర సమయంలో మంచుకురిసే అవకాశం ఉండటంతో.. టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్లు బౌలింగ్ తీసుకునే చాన్స్ ఉంది. వరల్డ్ కప్ తర్వాత మొదటి సిరీస్ ఆడుతున్న ఇరు జట్లు.. ఎవరు బోణీ కొడతారో చూడాలి.




Updated : 23 Nov 2023 12:52 PM IST
Tags:    
Next Story
Share it
Top