AUS vs PAK: ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం.. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ
X
బెంగళూరులో పాకిస్తాన్ కు విశ్వరూపం చూపిస్తుంది ఆస్ట్రేలియా. ఒక్కో పాక్ బౌలర్ ను ఊచకోత కోస్తూ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్.. మొదటి ఓవర్ నుంచి పాక్ బౌలర్లపై ఆదిపత్యం ప్రదర్శిస్తుంది. బౌడరీలు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించింది. ఒక్క వికెట్ కోల్పోకుండా ఓపెనర్లే ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. డేవిడ్ వార్నర్ విధ్వంసానికి, మిచెల్ మార్ష్ తోడవడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెడుతుంది. కేవలం 32 ఓవర్లలోనే 226 పరుగులు చేశారు. వార్నర్ 85 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. అదే జోరును మార్ష్ కూడా కొనసాగిస్తూ.. 100 బంతుల్లో 6 సిక్సర్లు, 10 ఫోర్లతో 101 పరుగులు చేసి సెంచరీలు సాధించారు.
ఈ ఇన్నింగ్స్ లో మొదటి వికెట్ కు అత్యధిక పరుగులు చేసిన జోడీగా రికార్డ్ నెలకొల్పారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది మినహా ఏ బౌలర్ రాణించలేకపోయారు. హరీస్ రౌఫ్ కు ఆసీస్ బ్యాటర్లు పట్టపగలే చుక్కలు చూపించారు. ఈ ఇన్నింగ్స్ లో 3 ఓవర్లు వేసిన హారిస్.. 47 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్ బాబర్ ఆజం నిర్ణయాన్ని అంతా తప్పుబడుతున్నారు. బ్యాటింగ్ పిచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమే బాబర్ చేసిన అతిపెద్ద తప్పని అంటున్నారు.
తుది జట్లు:
(ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11): డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ ( wk ), గ్లెన్ మాక్స్ వెల్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (c), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్ వుడ్
(పాకిస్తాన్ ప్లేయింగ్ 11): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (wk), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్