Home > క్రీడలు > IND vs SL:కుర్రాడి దెబ్బకు టాప్ ఆర్డర్ డమాల్

IND vs SL:కుర్రాడి దెబ్బకు టాప్ ఆర్డర్ డమాల్

IND vs SL:కుర్రాడి దెబ్బకు టాప్ ఆర్డర్ డమాల్
X

దునిత్ వెల్లంగలే.. పాతికేళ్లు కూడా లేవు. అంతర్జాతీయంగా 20 మ్యాచ్ లు (వన్డేల్లో 13 మ్యాచులు) ఆడిన అనుభవం కూడా లేదు. ఆసియా కప్ లో అరంగేట్రం చేసి రాణిస్తున్నాడు. తన స్పిన్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇవాళ కొలంబో వేదికపై భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో మ్యాజిక్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. మిస్టరీ స్పిన్ బంతులేస్తూ టీమిండియాను బెంబేలెత్తిస్తున్నాడు. దీంతో భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ (53), విరాట్ కోహ్లీ (3), శుభ్ మన్ గిల్ (19), కేఎల్ రాహుల్ (39), హార్దిక్ పాండ్యా (5) పెవిలియన్ చేరారు. 10 ఓవర్లు వేసిన దునిత్.. 4 సగటుతో 40 పరుగులే ఇచ్చుకున్నాడు. అందులో ఒక మెయిడెన్ ఓవర్ ఉంది. అలంక బౌలింగ్ లో ఇషాన్ కిషన్ (33) పెవిలియన్ చేరాడు.

టీమిండియాకు రెస్ట్ లెస్ క్రికెట్:

సూపర్ 4 ప్రారంభం అయినప్పటి నుంచి టీమిండియా రెస్ట్ లెస్ క్రికెట్ ఆడుతుంది. ఆదివారం పాకిస్తాన్ తో మొదలైన మ్యాచ్.. సోమవారం (రిజర్వ్ డే) ముగిసింది. మళ్లీ మంగళవారం శ్రీలంకతో మ్యాచ్ ప్రారంభం అయింది. దాంతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు టీమిండియా ప్లేయర్లు. టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులు ఆడినా.. ఆ ఫార్మట్ పూర్తి భిన్నంగా ఉంటుంది. సెషన్ ల వారిగా పూర్తిగా వేరే స్ట్రాటజీని ఫాలో అవుతారు. కానీ వన్డేల్లో అలా కాదు. 50 ఓవర్లు ఆట ఆడాలి. గ్రౌండ్ లో పూర్తిగా శ్రమించాలి. అందుకే ఈ మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు పూర్తిగా డీలా పడిపోయున్నారు. ఈ ఒత్తిడి నుంచి బయటపడి భారీ స్కోర్ చేసి మ్యాచ్ గెలవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.



Updated : 12 Sept 2023 5:53 PM IST
Tags:    
Next Story
Share it
Top