మొదటి టెస్ట్‌లో భారత ఓపెనర్ల జోరు..
X
డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ల హవా కొనసాగుతోంది. ఓవర్‌నైట్ స్కోర్ 80/0తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ లు నిలకడగా ఆడుతున్నారు. తన తొలి టెస్టు మ్యాచ్‌లో జైశ్వాల్ అర్ధసెంచరీ సాధించాడు. 104 బంతులు ఎదుర్కొని మొదటి హాఫ్ సెంచరీ చేశాడు. తర్వాత 106 బంతుల్లో రోహిత్ అర్ధశతకం నమోదు చేశాడు. వీరిద్దరి దూకుడుకు భారత్ ప్రస్తుతం 51 ఓవర్లలో 140 పరుగులు చేసింది. రోహిత్ 65, జైశ్వాల్ 59 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 150 పరుగులకే చేతులెత్తేసింది. 47 పరుగులు చేసిన అలిక్ అథనేజ్ టాప్ స్కోరర్. భారత్ బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు తీసి విండీస్‌ను ఉక్కిరిబిక్కిరి చేయగా రవీంద్ర జడేజా 3 వికెట్లతో రాణించాడు. ఠాకూర్, సిరాజ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.