Home > క్రీడలు > తొలి టెస్టులో పట్టుబిగిస్తున్న భారత్

తొలి టెస్టులో పట్టుబిగిస్తున్న భారత్

తొలి టెస్టులో పట్టుబిగిస్తున్న భారత్
X

విండీస్‌తో జరుగుతోన్న తొలి టెస్టు భారత్ పట్టుబిగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ అధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మూడో రోజు లంచ్‌ విరామానికి భారత్‌ 4 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. ఇక టెస్ట్‌ కెరియర్‌లో కోహ్లీ 29వ హాఫ్‌ సెంచరీ సాధించాడు. క్రీజులో కోహ్లీ(72) తో పాటు రవీంద్ర జడేజా(21)ఉన్నాడు. తొలి సెషన్‌లోనే యశస్వి జైశ్వాల్ (171), రహానె (3) ఔటయ్యారు.

జైశ్వాల్ అరుదైన ఘనత..

312/2 ఓవర్ నైట్ స్కోర్‌తో టీమిండియా మూడోరోజు బ్యాటింగ్ ప్రారంభించింది. సెంచరీ హీరో జైశ్వాల్ ఆరంభంలో తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలోనే 150 మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా మొదటి టెస్ట్‌లో 150 పరుగుల మార్కును అందుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా, అతి చిన్న వయసులో ఈ ఫీట్‌ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వి 21 సంవత్సరాల 196 రోజుల వయసులో టెస్ట్‌ అరంగేట్రంలో 150 పరుగుల మార్కును దాటగా.. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా పాక్‌ మాజీ క్రికెటర్‌ జావిద్‌ మియాందాద్‌ కొనసాగుతున్నాడు.మియాందాద్‌.. 19 ఏళ్ల 119 రోజుల వయసులో తన తొలి టెస్ట్‌లో 150 పరుగుల మార్కును దాటాడు. అతని తర్వాత ఆసీస్‌ ఆర్కీ జాక్సన్‌ (19 ఏళ్ల 149 రోజులు), ఆసీస్‌ డౌగ్‌ వాల్టర్స్‌ (19 ఏళ్ల 354 రోజులు), జార్జ్‌ హెడ్లీ (20 ఏళ్ల 226 రోజులు) ఉన్నారు.


రికార్డు మిస్

150 తర్వాత జైశ్వాల్ దూకుడు చూస్తే డబుల్ సెంచరీ సాధిస్తాడని అంతా భావించారు. కానీ 126వ ఓవర్లో జెసెఫ్ వేసిన చివరి బంతిని ఎదుర్కొనే క్రమంలో యశస్వి(171) వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మరో 17 పరుగులు చేసి ఉంటే.. భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చర్రికెక్కేవాడు.


Updated : 14 July 2023 10:06 PM IST
Tags:    
Next Story
Share it
Top