Home > క్రీడలు > చరిత్ర సృష్టించిన వెస్టిండీస్..1997 తర్వాత తొలిసారి

చరిత్ర సృష్టించిన వెస్టిండీస్..1997 తర్వాత తొలిసారి

చరిత్ర సృష్టించిన వెస్టిండీస్..1997 తర్వాత తొలిసారి
X

ప్రపంచ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ జట్టుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్టో అంటే 80వ దశకం సమయంలో ఆ జట్టును ఢీకొట్టేవారు లేరు. ప్రపంచ క్రికెట్ జట్లు అన్నీ విండీస్‌తో ఆడి తలొంచేవి. వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో అన్ని జట్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని వెస్టిండీస్ జట్టు కనబరిచేది. అయితే 90వ దశకం తర్వాత విండీస్ పతనం ప్రారంభమైందనే చెప్పాలి. ఈ మధ్య వన్డే వరల్డ్ కప్‌కు కనీస అర్హతను కూడా ఆ జట్టు సాధించలేకపోయింది.

అన్ని ఫార్మాట్లలోనూ పేలవ ప్రదర్శనను కొనసాగించే విండీస్ జట్టు 21 ఏళ్ల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేత, వన్డే వరల్డ్ కప్ విజేత అయిన ఆస్ట్రేలియా జట్టును విండీస్ జట్టు ఓడించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో పింక్ బాల్ టెస్ట్‌లో విండీస్ విజయాన్ని నమోదు చేసింది. క్రెయిన్ బ్రాత్ వైట్ సారథ్యంలో వెస్టిండీస్ జట్టు 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది.

ఇకపోతే విండీస్ విజయంలో షామార్ జోసెఫ్ కీలక భూమిక పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లను పడగొట్టి ఆసీస్ బ్యాటర్లకు వణుకు తెప్పించాడు. ఈ షామార్ జోసెఫ్ అనే పేరు ఇది వరకూ విండీస్ జట్టులో ఎప్పుడూ వినిపించలేదు. అతనికి తన కెరీర్‌లో ఇది రెండో టెస్ట్ కావడం విశేషం. ఈ సీరిస్‌తో షామార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 24 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ వెస్టిండీస్ జట్టుకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చాడు. వెస్టిండీస్ విజయంతో ఇప్పుడు షామార్ పేరు మారుమోగుతోంది.

Updated : 28 Jan 2024 3:25 PM IST
Tags:    
Next Story
Share it
Top