IND vs AUS: ప్రపంచకప్ ఫైనల్.. పిచ్ ఎవరికి అనుకూలమంటే?
X
క్రికెట్ లో ప్రస్తుతం టాస్ కీలకం అయింది. టాస్ గెలిచిన జట్టుకే పిచ్ అనుకూలిస్తుండటంతో.. అంతా దాన్నే అనుకరిస్తున్నారు. చేజింగ్ కు అనుకూలిస్తుందా.. డిఫెండ్ చేయగలుగుతామా అని లెక్కలు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటికి తగ్గట్లే మ్యాచ్ రిజల్ట్స్ కూడా ఉంటున్నాయి. అయితే నేడు అహ్మదాబాద్ స్టేడియంలోని మోదీ స్టేడియంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో కూడా టాస్ కీలకం అయింది. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుండటంతో.. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ వరల్డ్ కప్ లో మోదీ స్టేడియంలో జరిగిన 4 మ్యాచుల్లో ఏ జట్టు కూడా 300 పరుగులు చేయలేకపోయింది.
ఈ క్రమంలో పిచ్ చేజింగ్ కు అస్సలు అనుకూలించదని.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 315 రన్స్ చేస్తే గెలిచే అవకాశముందని పిచ్ క్యూరేటర్ తెలిపారు. సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు వికెట్ స్లో అయి, టర్న్ లభిస్తుందని చెబుతున్నారు. అయితే గత 12 ప్రపంచకప్ లను పరిశీలిస్తే.. టాస్ ఓడిన జట్టే ఎక్కువసార్లు (8) విజేతగా నిలిచింది. టాస్ గెలిచిన టీం కేవలం 4 సార్లు మాత్రమే కప్ కొట్టింది. ఇప్పటివరకు టీమిండియా 2 సార్లు వరల్డ్ కప్ గెలవగా.. ఆస్ట్రేలియా ఖాతాలో 5 వరల్డ్ కప్ లు ఉన్నాయి. 2003 ప్రపంచకప్ ఫైనల్స్ లో ఆసీస్ చేతిలో ఓడిపోయిన భారత్.. ఈ మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.