క్రికెట్లో రౌండ్ రాబిన్ ఫార్మాట్ అంటే ఏంటి..? టీమిండియా ఎందుకు భయపడుతోంది..?
X
క్రికెట్ అభిమానులంతా అక్టోబర్ నెలలో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఐసీసీ.. ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. అంతేకాకుండా ఈ మెగా టోర్నీ మొత్తం రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. క్రికెట్లో రౌండ్ రాబిన్ ఫార్మాట్ అంటే ఏంటి..? ఈ ఫార్మాట్ ఎలా ఉంటుందని వెతుకుతున్నారు. అయితే, ఈ ఫార్మాట్ గురించి తెలిసిన వాళ్లు మాత్రం భయపడుతున్నారు. ఎందుకంటే..?
రౌండ్ రాబిన్ ఫార్మాట్ అంటే..?
రౌండ్ రాబిన్ ఫార్మాట్ పద్దతిలో ప్రతీ జట్టు టోర్నీలో పాల్గొన్న జట్టుతో ఒక మ్యాచ్ ఆడుతుంది. అంటే టీమిండియా ఈ టోర్నోలో పాల్గొన్న తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. పాయింట్స్ టేబుల్ లో టాప్ ఫోర్ లో నిలిచిన 4 జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. ఈ ఫార్మాట్ లో ఇప్పటివరకు 1992, 2019లో టోర్నీలను నిర్వహించారు. ఈ ఫార్మాట్ ఇప్పటివరకు టీమిండియాకు అచ్చిరాలేదు. 1992లో గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి దారి పట్టగా.. 2019లో సెమీస్ కు చేరి న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. దీంతో అభిమానుల గుండెల్లో గుబులు మొదలయింది. ఈసారైనా ఈ ఫార్మాట్ లో రాణించి కప్పుకొట్టాలని ఆశిస్తున్నారు. ఈ ఫార్మాట్ లో టోర్నీని నిర్వహించడంపై స్పంధించిన ఐసీసీ.. ఈ ఫార్మాట్ వల్ల ప్రతీ జట్టుకు సెమీస్ చేరే అవకాశం దక్కుతుందని, ఒక మ్యాచ్ లో కాకపోయినా, మరో మ్యాచ్ లో అయినా రాణించగలదని ఐసీసీ తెలిపింది.