Home > క్రీడలు > టెస్టు క్రికెట్‌లో ‘బజ్ బాల్’ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?

టెస్టు క్రికెట్‌లో ‘బజ్ బాల్’ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?

టెస్టు క్రికెట్‌లో ‘బజ్ బాల్’ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
X

ఇంగ్లండ్ టీం టెస్ట్ క్రికెట్ ఆడుతుందంటే చాలు.. ఎక్కువగా వినపడే పదం ‘బజ్ బాల్’. టెస్టుల్లో మిగతా మ్యాచుల్లో ఆడినట్లు తీరిగ్గా ఐదు రోజులు ఆడతామంటే కుదరదు. వన్డే, టీ20ల్లో ఆడినట్లు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటమే బజ్ బాల్. బైలింగ్ శైలి కూడా అలానే ఉంటుంది. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ ఇంగ్లండ్ టీం హెడ్ కోచ్ అయ్యాక ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. మెక్ కల్లమ్ కోచ్ గా బాధ్యలు తీసుకున్నప్పటి నుంచి ఇంగ్లండ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది.

బ్యాటర్లు ఎదుర్కున్న తొలి బంతి నుంచే బౌండరీలు బాదుతారు. ఫోర్లు, సిక్సర్లు కొడుతు ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకొస్తారు. అదే ఇంగ్లండ్ కు విజయాలను తెచ్చిపెట్టింది. అయితే, యాషెస్ సిరీస్ 2023 నుంచి బజ్ బాల్ కాన్సెప్ట్ పాపులర్ అవుతోంది. ఎవర్ని చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ బజ్ బాల్ కాన్సెప్ట్ ఏంటి..? ఎక్కడి నుంచి వచ్చిందని నెట్ లో సెర్చ్ చేస్తున్తారు.

ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

అందరికీ టీ20 ఫార్మట్ వచ్చినప్పటి నుంచి ధనాధన్ ఆట తెలుసు. కానీ, బ్రెండన్ మెక్ కల్లమ్ ది మొదటి నుంచి అదే ఆటతీరు. ఐపీఎల్ మొదటి సీజన్ లో అదే ఆటతీరుతో సెంచరీ చేసి అందరి దృష్టిలో పడ్డాడు. బాల్ పడటంతో ఫ్రంట్ ఫూట్ వచ్చి. . బౌండరీలు కొట్టేవాడు. దాంతో అప్పటినుంచి మెక్ కల్లమ్ ను ‘బజ్’అని పిలిచేవాళ్లు. ఆ కారణంగానే ఈ టెస్టుల్లో బజ్ బాల్ కాన్సెప్ట్ వచ్చింది.



cricket news, sports news, bcci, icc, latest news, telugu news, bazball, ashes series 2023, Brendon McCullum, england vs australia, what is bazball

Updated : 22 Jun 2023 10:30 PM IST
Tags:    
Next Story
Share it
Top