Home > క్రీడలు > ICC WORLD CUP 2023 : మిగిలింది రెండు మ్యాచ్లే.. టీమిండియా ఓడిపోతే పరిస్థితి ఏంటి?

ICC WORLD CUP 2023 : మిగిలింది రెండు మ్యాచ్లే.. టీమిండియా ఓడిపోతే పరిస్థితి ఏంటి?

ICC WORLD CUP 2023 : మిగిలింది రెండు మ్యాచ్లే.. టీమిండియా ఓడిపోతే పరిస్థితి ఏంటి?
X

ప్రపంచకప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. రోహిత్ శర్మ సారథ్యంలో సత్తా చాటుతుంది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఓటమి ఎరగకుండా దూసుకుపోతుంది. గురువారం వాంఖడే స్టేడియంలో శ్రీలంకను చిత్తు చేసి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 14 పాయింట్లతో టేబుల్ లో అగ్రస్థానానికి దూసుకుపోయింది. సెమీస్ కు అర్హత సాధించింది. 12 పాయింట్స్ తో సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉంది. అయితే భారత్ కంటే సౌతాఫ్రికా రన్ రేట్ (2.290) మెరుగ్గా ఉంది. ఇక టాప్ ఫోర్ లో నిలవడం కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ జట్లు పోటీ పడుతున్నాయి. కాగా టీమిండియా గ్రూప్ స్టేజ్ లో ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సిఉంది.

నవంబర్ 5న సౌతాఫ్రికాతో, నవంబర్ 12న నెదర్లాండ్స్ తో ఆడుతుంది. ఈ రెండు మ్యాచుల్లో భారత్ గెలిస్తే పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఒకవేళ రెండు మ్యాచుల్లో ఓడితే టేబుల్ లో రెండో స్థానానికి పడిపోతుంది. అందే జరిగి.. ఆసీస్ కు మిగిలున్న మూడు మ్యాచుల్లో గెలిస్తే.. టీమిండియా 3వ స్థానానికి పడిపోతుంది. ఆసీస్ మూడిట్లో గెలిస్తే.. చెరో 14 పాయింట్స్ ఉంటాయి కాబట్టి రన్ రేట్ ఆధారంగా జట్టు స్థానం నిర్ణయం అవుతుంది. అదికాకుండా సౌతాఫ్రికాకు మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచి, భారత్ ఒక మ్యాచ్ లో గెలిస్తే.. అప్పుడు రెండు జట్లకు 16 పాయింట్స్ ఉంటాయి. ఇప్పటికే సౌతాఫ్రికాకు రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో సౌతాఫ్రికా 1వ స్థానం, భారత్ రెండో స్థానంలో నిలుస్తాయి.




Updated : 3 Nov 2023 4:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top