Home > క్రీడలు > Akaay: ట్రెండింగ్‌లో అకాయ్.. నెటిజన్లు గూగూల్ చేస్తున్న వర్డ్ ఇదే

Akaay: ట్రెండింగ్‌లో అకాయ్.. నెటిజన్లు గూగూల్ చేస్తున్న వర్డ్ ఇదే

Akaay: ట్రెండింగ్‌లో అకాయ్..  నెటిజన్లు గూగూల్ చేస్తున్న వర్డ్ ఇదే
X

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు.. తాజాగా ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15నే వీళ్లకు బాబు పుట్టినా.. ఐదు రోజుల తర్వాత మంగళవారం (ఫిబ్రవరి 20) అనౌన్స్ చేశారు. అంతేకాదు ఆ పసివాడికి ‘అకాయ్’గా పేరు పెట్టినట్లు కూడా వెల్లడించారు. దీంతో ‘అకాయ్’ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆ పేరుకి అర్థమేంటో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.

కోహ్లీ ప్రకటన తర్వాత ఈ పేరుకి అర్థంపై సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు. సంస్కృతంలో ఈ పదానికి ‘అమరుడు’, ‘చిరంజీవుడు’ అనే అర్థం ఉందని వెల్లడించారు. అలాగే హిందీలో ‘కాయ్‌’ అంటే శరీరమని.. ‘అకాయ్‌’ అంటే భౌతిక శరీరానికి మించినవాడు అని చెబుతున్నారు. మరోవైపు టర్కీ భాషలో ఈ పదానికి ‘ప్రకాశిస్తున్న చంద్రుడు’ అనే అర్థం కూడా ఉందట. మరి విరుష్క జంట ఏ అర్థంలో తమ బిడ్డకు అకాయ్‌గా నామకరణం చేశారో అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ 2017లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు జనవరి 11, 2021న కూతురు వామిక పుట్టింది. ఇక చాలా రోజులుగా అనుష్క రెండోసారి ప్రెగ్నెంట్ అనే వార్తలు వస్తూనే ఉన్నా.. ఈ దంపతులు ఎప్పుడూ బయటకు చెప్పలేదు. చివరికి ఇంగ్లండ్ తో కీలకమైన సిరీస్ కు కోహ్లి మొత్తం దూరమవడానికి కారణం ఇదే అన్న విషయాన్ని కూడా దాచి పెట్టారు. చివరికి ఆ సస్పెన్స్ కు తెరదించుతూ.. తాము మళ్లీ తల్లిదండ్రులమయ్యామన్న విషయాన్ని కోహ్లి, అనుష్క దంపతులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కోహ్లి వ్యక్తిగత కారణాలతో భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

Updated : 21 Feb 2024 10:52 AM IST
Tags:    
Next Story
Share it
Top