Ravichandran Ashwin : అశ్విన్ ప్లేస్లో ఎవరు? టీమిండియా 10 మందితోనే ఆడాలా? ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయ్
X
మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోన్న మూడో టెస్టు నుంచి టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్ధాంతరంగా తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తెలిపింది. అశ్విన్ కుటుంబంలో తలెత్తిన వైద్య పరమైన అత్యవసర పరిస్థితి కారణంగా.. ఇంటికి వెళ్లినట్లు బీసీసీఐ ట్విటర్లో తెలిపింది. ఈ పరిస్థితుల్లో అశ్విన్ కు అండగా ఉంటామని ధైర్యం చెప్పింది బీసీసీఐ. అయితే అశ్విన్ స్థానంలో ఎవరు ఆడతారనేది అభిమానుల్లో క్వశ్చమార్క్ గా మారింది. అతని స్థానంలో మరొకరికి తీసుకునే అవకాశం ఉందా? లేదా టీమిండియా 10 మందితోనే ఆడాలా? ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. నిబంధనల ప్రకారం మ్యాచ్ మధ్యలో ఓ ప్లేయర్ గాయపడినా, అనారోగ్యానికి గురైనా సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ ను తీసుకునే అవకాశం కల్పిస్తారు. అయితే సబ్ స్టిట్యూట్ గా వచ్చిన ఫీల్డర్ మాత్రం కేవంలం ఫీల్డింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అంపైర్ల పర్మిషన్ తీసుకుని వికెట్ కీపింగ్ చేయొచ్చు.
కాగా అశ్విన్ స్థానంలో దేవ్ దత్ పడిక్కల్ ను జట్టులోకి తీసుకుని ఫీల్డింగ్ చేయిస్తున్నారు. అయితే ఇందులో కంకషన్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. కంకషన్ ప్లేయర్ మాత్రమే బ్యాటింగ్, బౌలింగ్ చేయడానికి అర్హులు. రూల్స్ ప్రకారం ఓ ఫీల్డర్ ఆన్ ఫీల్డ్ లో గాయపడి మ్యాచ్ కు దూరమయితే మరో ప్లేయర్ ను తీసుకుని ఆడిస్తారు. కానీ అశ్విన్ అలా చేయలేదు కాబట్టి, టీమిండియాకు మరో ప్లేయర్ తో బ్యాటింగ్, బౌలింగ్ చేయించే అవకాశం లేదు. కానీ ఓ పాజిబుల్ సొల్యూషన్ ఉంది. అశ్విన్ ప్లేస్ లో ఇంకకరిని ఆడించాలంటే భారత్.. ఇంగ్లాండ్ బోర్డుకు అధికారికంగా అభ్యర్థన పెట్టాలి. కెప్టెన్ బెన్ స్టోక్స్ అనుమతి తీసుకోవాలి. అది జరిగితే టీమిండియా వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్ ను తీసుకునే చాన్స్ ఉంది.