వెస్టిండీస్‌తో టెస్టులకు పుజారాపై వేటు.. కారణమిదేనా ?
X
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత్ టెస్ట్, వన్డే జట్టులను శుక్రవారం బీసీసీఐ ప్రకటిచింది. 16 మంది సభ్యులతో కూడిన టెస్ట్, 17 మంది ప్లేయర్లతో కూడిన వన్డే జట్ల వివరాలను వెల్లడించింది. ఐపీఎల్, దేశవాలి మ్యాచ్ ల్లో రాణించిన యువకులకు సెలెక్టర్లు పెద్దపీట వేశారు. రుతురాజ్ గైక్వాడ్ టెస్ట్‌ల్లో అవకాశం దక్కింది. పేసర్ ముఖేష్ కుమారు వన్డే, టెస్ట్ జట్లలో చోటు సంపాదించాడు. జైశ్వాల్ టెస్ట్ జట్టుకు ఎంపికైనా..వన్డే జట్టులో అవకాశం దక్కలేదు. సంజూ శాంసన్ రీఎంట్రీ ఇవ్వడంతో కేఎస్ భరత్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. రహానె టెస్ట్‌ల్లో వైఎస్ కెప్టెన్సీని సొంతం చేసుకున్నాడు.
ఇక టెస్ట్ జట్టు నుంచి పుజారాకు స్థానం లభించక లేకపోవడం చర్చనీయాంశమైంది. WTC ఫైనల్‌లో ఘోరంగా విఫలమైన పుజారాపై వేటు వేయాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే పుజారాను తప్పించడం ఆసక్తిగా మారింది. ఇక అతడి పని అయిపోయినట్లే అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ బీసీసీఐ అధికారి పుజారాను ఎంపిక చేయకపోవడానికి కారణాలు వెల్లడించాడు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ కాంబినేషన్‌ను ప్రయత్నించాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు సెలెక్టర్లు భావించారని, ఈ కారణంగానే పుజారాకు వెస్టిండీస్ పర్యటనలో చోటు దక్కలేదని తెలిపాడు.ఈ ఒక్క సిరీస్ లో చోటుదక్కలేదని పుజారాకు డోర్లు మూసుకుపోయాయి అనడం కరెక్ట్ కాదని వెల్లడించాడు. ఈ విషయాన్ని పుజారాతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వెస్టిండీస్ టూర్ టీమిండియా రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూలై 12 నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది.