Home > క్రీడలు > టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇచ్చే ‘గద’ వెనుక కథ.. అసలేంటి?

టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇచ్చే ‘గద’ వెనుక కథ.. అసలేంటి?

టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇచ్చే ‘గద’ వెనుక కథ.. అసలేంటి?
X

వరల్డ్ కప్ లో, ఐపీఎల్ లో.. ప్రపంచంలో ఎక్కడ.. ఏ టోర్నీ చూసినా.. విజేతలకు అందించే ట్రోఫీ ఆకారం ఒకేలా (కప్ షేప్) ఉంటుంది. అయితే, క్రికెట్ లో టెస్ట్ లకు వచ్చేసరికి అలా కాదు. కప్ కి బదులు గదను బహుకరిస్తారు. ఇదివరకు టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు ఈ గద ఇచ్చేవాళ్లు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ వచ్చాక.. గదతో పాటు భారీ ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నారు. అయితే. ఈ గద వెనుక కథ లేకపోలేదు.

2000 సంవత్సరంలో ఐసీసీ ఈ గదను తయారుచేయిందచింది. ట్రావెర్ బ్రౌన్ అనే డిజైనర్ దీన్ని రూపొందించాడు. దీని తయారీ వెనుక అతన్ని ప్రేరేపించిన అంశాలను కూడా ఆయనే వెల్లడించాడు. ‘ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు.. స్టంప్స్ (వికెట్లు)ను తీసుకుని సంబరాలు చేసుకుంది. దాంతో వికెట్ ను మీడియమ్ గా తీసుకున్నా. తర్వాత బాల్ ని కేద్రంగా తీసుకుని గద ఆకారాన్ని తయారు చేశా. ఇందులో హ్యాండిల్ చుట్టూ ఉండే రిబ్బన్ విజయానికి సంకేతం’ అంటూ ట్రావెర్ బ్రౌన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టెస్ట్ ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్స్, రన్నరప్ జట్టుకు 8 లక్షల డాలర్లు ఇస్తున్నారు.

Updated : 7 Jun 2023 6:01 PM IST
Tags:    
Next Story
Share it
Top