India Vs Pak Match: అభిమానుల్లో ఆందోళన.. భారత్-పాక్ మ్యాచ్ జరిగినట్లే?
X
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు మరో రెండు రోజులే టైం ఉంది. ఈ క్రమంలో ఐసీసీ అభిమానులకు చేదు వార్త చెప్పింది. ఈ మ్యాచ్ నిర్వాహణ కష్టమయ్యే అవకాశం ఉందని తేల్చింది. దాంతో ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డుపడే అవకాశం ఉంది. పల్లెకెలెలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం (సెప్టెంబర్ 2) కూడా భారీ వర్షం (90 శాతం) పడే ఛాన్స్ కనిపిస్తుందని వాతావరణ శాఖ నివేదికలో తెలిపింది. దీంతో దయాదుల పోరు కష్టమే అనే మాటలు వినిపిస్తున్నాయి.
మామూలుగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో శ్రీలంకలో వర్షాలు కురుస్తాయి. ఇప్పటివరకు పల్లెకెలె వేదికపై 33 మ్యాచ్ లు జరుగగా.. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కేవలం 3 మాత్రమే జరిగాయి. ఈ పోరుకు టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. వర్షం ముప్పు ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని అభిమానుల్లో ఆందోళన మొదలయింది. మ్యాచ్ కు 10 గంటల టైం ఉంటుంది కనున ఫ్యాన్స్ బెంగ పడాల్సిన పనిలేదు. వర్షం కొంతసేపు పడి ఆగితే మ్యాచ్ ను 20 ఓవర్లకు కుదించే అవకాశం ఉంది. కావున టికెట్ కొన్నవాళ్లు నిరాశ పడాల్సిన అవసరం లేదు.