Kane Williamson: కివీస్కి బ్యాడ్ న్యూస్.. వరల్డ్కప్కు విలియమ్సన్ దూరం
X
హాట్రిక్ విజయాలతో అదరగొడుతున్న న్యూజిలాండ్ కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. వరల్డ్ కప్ ప్రారంభంలోనే గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న కేన్ విలియమ్సన్.. కోలుకుని తిరిగొచ్చాడు. నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రీఎంట్రీ ఇచ్చి కేన్.. మళ్లీ గాయం బారినపడ్డాడు. రన్ ఔట్ కోసం బంగ్లా ఫీల్డర్ బంతిని విసరగా.. అది నేరుగా వచ్చి విలియమ్సన్ ఎడమచేతి బొటనవేలికి బలంగా తగిలింది. తాజాగా ఆ గాయంపై వచ్చిన రిపోర్ట్ లో.. విలియమ్సన్ వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది.
అతడి ఎడమచేతి బొటనవేలు ఎముక పగిలినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విలియమ్సన్ జట్టుకు అందుబాటులోనే ఉన్నప్పటికీ.. ఆడటం మాత్రం అనుమానంగా మారింది. విలియమ్సన్ కు ప్రత్యామ్నాయంగా టామ్ బ్లండెల్ జట్టులోకి రానున్నాడు. ప్రస్తుతం విలియమ్సన్ కు రెండు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. ఒకవేళ ఈ టైంలో కోలుకోకపోతే.. వరల్డ్ కప్ మొత్తానికి దూరం అయ్యే అవకాశం ఉంది.