Home > క్రీడలు > టీమిండియాకు స్వల్ప టార్గెట్.. మెరుపు బైలింగ్తో రెచ్చిపోయిన..

టీమిండియాకు స్వల్ప టార్గెట్.. మెరుపు బైలింగ్తో రెచ్చిపోయిన..

టీమిండియాకు స్వల్ప టార్గెట్.. మెరుపు బైలింగ్తో రెచ్చిపోయిన..
X

ట్రినిడాడ్ వేదికపై వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా కుర్రాళ్లు సత్తా చాటారు. టాస్ ఓడి బౌలింగ్ రాగా.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ విండీస్ బౌలర్లను కట్టడి చేశారు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడిన విండీస్ ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. చాహల్ వరుస వికెట్లతో విజృంభించడంతో.. మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చింది. 5 ఓవర్లకు 40/2 వికెట్లతో ఉన్న విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ తన స్పిన్ తో బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేశాడు. 4 ఓవర్లు వేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు.

కెప్టెన్ హార్దిక్ కూడా ఫామ్ కుదిర్చుకున్నాడు. 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. చివర్లో హర్ష్ దీప్ సింగ్ మెరుపు బంతులతో విండీస్ బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టించాడు. డెబ్యూటెంట్ ముకేష్ కుమార్ పరవాలేదనిపించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా విండీస్ బ్యాట్స్ మెన్ పూరన్ (41, 34 బంతుల్లో), పావెట్ (48, 32 బంతుల్లో) టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. సిక్సర్లు, ఫోర్లతో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (28, 19 బంతుల్లో) రెచ్చిపోయి.. ఆరంభంలో టీమిండియాపై ఒత్తిడి పెట్టాడు. చాహల్ బ్రాండన్ వికెట్ పడగొట్టడంతో కథ మారిపోయింది. చివర్లో హెట్ మెయర్ (10, 12 బంతుల్లో) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.

Updated : 3 Aug 2023 10:01 PM IST
Tags:    
Next Story
Share it
Top