అద్గదీ...అట్లుంటుంది మన క్రికెటర్లు అంటే....
X
విరాట్ కోహ్లీని కలవడానికి వచ్చిన విండీస్ క్రికెటర్ తల్లి
విరాట్ కోహ్లీ...ఇండియన్ స్టార్ బ్యాట్స్ మన్. ఇతనంటే మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. విరాట్ ఆట, డాన్స్, కోసం ఇలా అన్నింటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అంతెందుకు పక్క దేశాల క్రికెటర్ల బంధువులు కూడా మనోడికి అభిమానులే. తాజాగా విండీస్ క్రికెటర్ తల్లి తన కొడుకు ఆటను చూడ్డానికి కాకుండా విరాట్ చూడ్డానికి వచ్చిందంటేనే తెలుస్తోంది...అతని ఖ్యాతి ఎంతలా పాకిందో.
విండీస్ తో జరగుతున్న రెండో టెస్ట్ లో విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. సెంచరీ చేసి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అసలే అతనికి ఫ్యాన్...ఇప్పుడు ఇంకా బాగా ఆడుతున్నాడు. ఇక ఉండలేక పోయారు విండీస్ క్రికెటర్ జాషువా డిసిల్వ తల్లి. కొడుకుకు ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పి మరీ వచ్చి కోహ్లీని కలిసి వెళ్ళారు. ఈ వీడియో, జాషువా మాటు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
విండీస్ వికెట్ కీపర్ జాషువా డిసిల్వ. విరాట్ ను చూసేందుకు నేను వస్తున్నా అని చెప్పగానే నేను షాక్ అయ్యా అంటున్నాడు జాషువా. అయితే నాకు బాగా తెలుసు నా ఆట చూడ్డానికి రాని మా అమ్మ విరాట్ కోసం ఎందుకు వస్తోందో...ఆమె అతనికి వీరాభిమాని అని చెబుతున్నాడు. ఇక అతని తల్లి అయితే విరాట్ను కలిసి తర్వాత ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. మొదటిసారి అతన్ణి కలిశాను. అతను చాలా అద్భుతమైన వ్యక్తి అంటూ తెగపొగిడేశారు. తన కొడుకు కూడా విరాట్ లా ఆడాలని కోరుకుంటున్నా అంటూ భావోద్వేగానికి గురయ్యారు.