Fabian Allen : విండీస్ క్రికెటర్‌ను తుపాకితో బెదిరించిన దుండగులు
X
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఫాబియన్ అలెన్(Fabian Allen)కు చేదు అనుభవం ఎదరైంది. ప్రస్తుతం అలెన్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ (Paarl Royals) తరపున ఆడుతున్నాడు. కొందరు దుండగలు శాండ్‌టన్ సన్ హోటల్ (Sandton Sun Hotel) వద్ద గన్‌తో బెదిరించి అతడి వద్ద ఉన్న విలువైన వస్తువులను లాక్కెళ్లారు. విండీస్ బోర్డు అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించడంతో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్(Johannesburg)లో జట్టు బస చేసిన హోటల్ సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అంతర్జాతీయ ఆటగాడికి కనీస భద్రత లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌతాఫ్రికా(South Africa)లో ఇలాంటి పరిస్థితిని ఊహించలేదంటూ క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. సౌతాఫ్రికా బోర్డుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలెన్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని విండీస్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనపై సౌతాఫ్రికా క్రికెట్ వర్గాలు ఇప్పటి వరకు స్పందించలేదు. అలెన్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు.ఈ లీగ్‌లో అలెన్ దారుణ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి 38 పరుగులు మాత్రమే చేశాడు.