ఐపీఎల్ కంటే.. వరల్డ్ కప్ గెలవడమే ఈజీ. అందుకే.. రోహిత్ బెస్ట్ అనిపించాడు
X
పోయిన ఏడాది జనవరిలో సౌతాఫ్రికా చేతిలో భారత్ 1-2 తేడాతో మూడు టెస్టుల సీరీస్ ను ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటికే విరాత్.. టీ20 కెప్టెన్సీ వదిలేయగా.. ఆ తర్వాత బీసీసీఐ వన్డే కెప్టెన్సీని లాగేసుకుంది. సౌతాఫ్రికా సిరీస్ తర్వాత టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పాడు. అప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరభ్ గంగూలితో విరాట్ కోహ్లీకి ఉన్న విభేదాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఐపీఎల్ సందర్భంగా మాటల యుద్ధం.. ఐపీఎల్ లో జరిగిన ఘటనల ఆధారంగా అందంతా నిజమని నమ్మారు ఫ్యాన్స్.
ఈ క్రమంలో కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై గంగూలీ స్పందించాడు. బీసీసీఐ ఎప్పుడూ కోహ్లీని టీ20 కెప్టెన్సీ వదులుకోవాలని కోరలేదని స్పష్టం చేశాడు. ‘విరాట్ కెప్టెన్సీ వదులుకున్నప్పుడు బీసీసీఐ అందుకు రెడీగా లేదు. కోహ్లీ అలా ఎందుకు చేశాడో నాకిప్పటికీ తెలియదు. కెప్టెన్సీ వదులుకున్నాక రోహిత్ ను కెప్టెన్ చేయాలని భావించాం. ఆ టైంలో అతనే కరెక్ట్ అనిపించింది. కోహ్లీ అద్భుతమైన నాయకుడు. రవిశాస్త్రి-కోహ్లీ ఆధ్వంర్యంలో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ఇంగ్లండ్, ఆసీస్ ను సొంత గడ్డపై మట్టికరిపించింది’అని గంగూలీ అన్నాడు.
రోహిత్ నాయకత్వంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ లో రాణిస్తుంది. కప్పు తెస్తుందనే నమ్మకం ఉంది. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఐదు సార్లు కప్పు కొట్టింది. ధోనీతో సమానంగా రోహిత్ ఉన్నాడు. ఐపీఎల్ లో కప్పు గెలవడమే చాలా కష్టం. 14 మ్యాచులు ఆడాలి. ప్లేఆఫ్స్, క్వాలిఫయర్, ఫైనల్స్ అన్ని దాటాలి. వన్డే వరల్డ్ కప్ లో అలా కాదు. నాలుగైదు మ్యాచ్ లు గెలిస్తూ సెమీ ఫైనల్ చేరిపోతారు. అందుకే ప్రపంచ కప్ గెలవడం కన్నా.. ఐపీఎల్ కప్ గెలవడం చాలా కష్టమని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
Winning the IPL trophy is tough: Sourav Ganguly
sports news, cricket news, latest news, telugu news, wtc fijnal, odi world cup, Rohit Sharma, rohit sharma confidence, virat kohli, Sourav Ganguly,wtc final, odi world cup