Home > క్రీడలు > స్వర్ణంపైనే నీరజ్ చోప్రా కన్ను..మరి లక్ష్యం సాధిస్తాడా?

స్వర్ణంపైనే నీరజ్ చోప్రా కన్ను..మరి లక్ష్యం సాధిస్తాడా?

స్వర్ణంపైనే నీరజ్ చోప్రా కన్ను..మరి లక్ష్యం సాధిస్తాడా?
X

ఒలింపిక్స్‌‎లో ఒక మెడల్ సాధిస్తే చాలనుకున్న సమయంలో.. ఏకంగా స్వర్ణ పతకాన్ని సాధించి అందరి దృష్టి తనపై పడేలా చేశాడు భారత స్టార్​ జావెలిన్‌ త్రో ఆటగాడు నీరజ్‌ చోప్రా. స్వర్ణం​ సాధించినప్పటికి కూడా తన ఆటను అలాగే నిలకడ కొనసాగిస్తూ అత్యద్భుతమైన విజయాలతో నాన్ స్టాప్‎గా రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తన కెరీర్​లో ఉన్నత స్థాయిలో నిలబడుతూ ​ముందుకు వెళ్తున్నాడు. అయితే లేటెస్టుగా ఈ యోధుడి ఎదురుగా మరో పెద్ద టార్గెట్ నిలిచింది.అదే.. వరల్డ్​ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌. ఈ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడమే గురిగా కసరత్తు చేస్తున్నాడు చోప్రా.

వరల్డ్​ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నమెంట్ నీరజ్ చోప్రాను ఊరిస్తోంది. గత ఏడాది ఈ ఈవెంట్‎లో సిల్వర్​ కైవసం చేసుకున్న నీరజ్​.. ఈసారి ఎలాగైనా స్వర్ణం సాధించాలన్న కసితో పట్టుదలతో ఉన్నాడు. అభిమానులు సైతం నీరజ్ గోల్డ్ మెడల్ సాధిస్తాడడి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి నీరజ్‌ తన ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెడతాడా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్‎గా మారింది. నిజానికి నీరజ్​ ఎప్పుడూ..తనపై పెట్టుకున్న అంచనాలను మించి తన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంటాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా స్వర్ణం సాధించి తన ఆట తీరుతో ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత డైమండ్‌ లీగ్‌లోనూ గోల్డ్ మెడల్‎ను ముద్దాడాడు ఈ యోధుడు. అందుకే ఈ సారి ఎలాగైనా ఈ టోర్నమెంట్‎లో గోల్డ్ మెడల్‎ను గెలవాలని కసరత్తు చేస్తున్నాడు. క్వాలిఫయింగ్‌ రౌండ్‎లో నీరజ్ పెర్ఫార్మెన్స్ చూశాక స్వర్ణం ఖాయమని భారత అభిమానులు అంచనా వేస్తున్నారు. కేవలం ఒకే త్రోతో 88.77 మీటర్ల దూరం బల్లెంను విసిరి ఒకేసారి ​ ఫైనల్స్‎కు క్వాలిఫై అయ్యాడు. తన ఆటతో గ్రూప్‌లో మొదటిస్థానం అందుకోవడంతో పాటు పారిస్‌ ఒలింపిక్స్‌కు బెర్తును సాధించుకున్నాడు. ఇక ఇదే క్వాలిఫైయింగ్​ రౌండ్ లో నీరజ్‌కు పోటీగా నిలుస్తారని భావించిన జులియన్‌ వెబర్‌ , వాద్లెచ్‌ లు కూడా నీరజ్​ను ఢీ కొట్టలేకపోయారు. మరో ప్రధాన కాంపిటీటర్ అర్షద్‌ నదీమ్‌ మాత్రమే మెరుగైన ప్రదర్శనను అందించాడు. మరి ఇప్పుడు నీరజ్​ వరల్డ్​ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌‎లో ఎంతవరకు రాణిస్తాడో.. ప్రత్యర్థులు ఎలా ఢీ కొంటాడో, అభిమానులను నమ్మకాన్ని ఎంత వరకు నిలబెడతాడో...అన్నది ఫౌనల్ వరకు ఎదురుచూడాల్సిందే.

Updated : 27 Aug 2023 9:18 AM IST
Tags:    
Next Story
Share it
Top