Home > క్రీడలు > విశ్వ విజేత గోల్డెన్ బోయ్ ఏం తింటాడో తెలుసా...

విశ్వ విజేత గోల్డెన్ బోయ్ ఏం తింటాడో తెలుసా...

విశ్వ విజేత గోల్డెన్ బోయ్ ఏం తింటాడో తెలుసా...
X

ప్రస్తుతం దేశమంతా మారుమోగిపోతున్న పేరు నీరజ్ చోప్రా. ఇండియా గోల్డెన్ బోయ్ గా పేరు తెచ్చుకున్న ఈ జావెలిన్ త్రో ప్లేయర్ కొన్నేళ్ళుగా నిలకడగా రాణిస్తున్నాడు. దాని కోసం నీరజ్ చాలా కష్టపడుతున్నాడు. తాను ఫిట్ గా ఉండడానికి ప్రత్యేకమైన డైట్ తీసుకుంటున్నాడు. నీరజ్ లాంటి వాళ్ళకి ఒంట్లో చాలా బలం కావాలి...కానీ దాని కోసం ఏది పడితే అది తినేయకూడదు. దీనికోసం వాళ్ళు చాలా కఠినమైన డైట్ ను అనుసరిస్తారు. తాను కూడా అందుకు అతీతుడనేమీ కాందటున్నాడు గోల్డెన్ బోయ్. ఆ డైట్ వివరాలేంటో స్వయంగా చెబుతున్నాడు.

అథ్లెట్స్ కు ఫిట్ నెస్ చాలా ఇంపార్టెంట్. పోటీలు ఉన్నా లేకపోయినా దాన్ని మాత్రం వాళ్ళు ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉండాలి. ఏ మాత్రం ఫిట్ నెస్ లేకపోయినా అది వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. కెరీరే నాశనమైపోతుంది. అందుకే వాళ్ళు డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. నీరజ్ ఇలా ఉండడానికి నాలుగేళ్ళుగా చాలా అటెన్షన్ పెడుతున్నాను. నా శరీరాకృతిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను అని చెబుతున్నాడు.

నీరజ్ డైట్:

నిద్ర లేవగానే జ్యూస్ లేదా కొబ్బరి నీళ్ళు తాగుతానని చెబుతున్నాడు నీరజ్. దాని తర్వాత లైట్ గా బ్రేక్ ఫాస్ట్. మూడు లేదా నాలుగు ఎగ్ వైట్స్, రెండు బ్రెడ్ స్లైసెస్, ఒక కప్పు నిండా పప్పులు, పళ్ళు ఉంటాయిట ఆ బ్రేక్ ఫాస్ట్ లో.

ఇక లంచ్ విషయానికి వస్తే అన్నం, పెరుగు, పప్పు, గ్రిల్ చేసిన చికెన్, సలాడ్ తింటాడుట. భోజనం తర్వాత సాయంత్రం స్నాక్స్ కోసం పళ్ళు, బాదం పప్పు తింటానని చెబుతున్నాడు నీరజ్. ఇక నైట్ డిన్నర్ మాత్రం చాలా తేలికగా తీసుకుంటానంటున్నాడు. సూప్, బాయిల్డ్ వెజిటబుల్స్, పళ్ళు మాత్రమే డిన్నర్ లో ఉంటాయని చెప్పాడు. దాదాపుగా రోజూ ఇదే డైట్ ఉంటుంది. మామూలుగా అందరిలా తినాలన్నా కూడా తినలేము అని చెబుతున్నాడు నీరజ్. అయితే అప్పుడప్పుడు చీట్ మీల్స్ ఉంటాయి. అప్పుడు చుర్మా, స్వీట్స్, పానీ పూరీ లాంటివి తినడానికి ఇష్టపడతా అంటున్నాడు ఆ ఆరుడగుల ఛాంపియన్.

నీరజ్ స్వతహాగా వెజిటేరియన్. కానీ స్పోర్ట్స్ లో ఉన్నవాళ్ళకి నాన్ వెజ్ తప్పనిసరిగా తీసుకోవాలి. మాంసకృతుల్లో నుంచి వచ్చే పోషకాలు వాళ్ళకి చాలా అవసరం. అందుకే నీరజ్ కూడా నాన్ వెజ్ తినడం మొదలు పెట్టాడు అంట. నాన్ వెజ్ అందరికీ మంచిది అని కూడా చెబుతున్నాడు. అయితే దాన్ని కూడా తినేవిధంగానే తినాలి అని చెబుతున్నాడు. దేన్ని తిన్నా గ్రిల్ చేసుకుని తింటే మంచిదని సలహా ఇస్తున్నాడు. గ్రిల్ చేసిన సాల్మన్ అన్నింటి కంటా బెస్ట్ అంటున్నాడు నీరజ్ చోప్రా.



Updated : 29 Aug 2023 7:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top