Home > క్రీడలు > వరల్డ్ కప్ షెడ్యూల్..తెలుగు అభిమానులకు నిరాశ

వరల్డ్ కప్ షెడ్యూల్..తెలుగు అభిమానులకు నిరాశ

వరల్డ్ కప్ షెడ్యూల్..తెలుగు అభిమానులకు నిరాశ
X

వన్డే వరల్డ్‌కప్ -2023 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. భారత్‌ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుంది. 46 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంటుకు 10 నగరాల్లోని స్టేడియాలను ఎంపిక చేశారు. టీమిండియా తన మొదటి మ్యాచ్ అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ ప్రపంచ కప్‌లో మొత్తం 10 టీమ్‌లు పాల్గొంటున్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబర్ 19న జరుగుతుంది.

వరల్డ్ కప్ షెడ్యూల్‌పై తెలుగు రాష్ట్రాల అభిమానులు కాస్త నిరాశగా ఉన్నారు. హైదరాబాద్‌లో కేవలం 3 మ్యాచ్ లే (అదనంగా వార్మప్ మ్యాచ్‌లు) నిర్వహిస్తుండడమే అందుకు కారణం. మూడు మ్యాచ్‌ల్లో ఒకటీ ఇండియా మ్యాచ్ లేకపోవడం.. అవి కూడా అక్టోబర్ 12కే ముగిసిపోతుండంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహించకపోవడానికి తెలంగాణ ఎన్నికలే కారణమని తెలుస్తోంది. అక్టోబర్‌లో తెలంగాణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉండడం.. నవంబర్ ఫస్ట్ లేదా సెకెండ్ వీక్‌లో పోలింగ్ జరిగే ఛాన్స్ ఉండడంతో తగినంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేమని తెలంగాణ పోలీస్ చెప్పినట్లు సమాచారం.ఈ కారణంతో మ్యాచ్ సంఖ్యలను తగ్గించడంతో పాటు...అక్టోబర్ 12కే ముగిసేటట్లు ప్లాన్ చేశారు.

అయితే కనీసం వైజాగ్‌లో ఒక్క మ్యాచ్ కూడా పెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతాన్నాయి. హైదరాబాద్ లో వీలుకానప్పుడు వైజాగ్ లోనైనా రెండు, మూడు మ్యాచ్ లు ఏర్పాటు చేయాల్సిందని అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా రెండు రాష్ట్రాల్లో టీమిండి ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఆడకపోవడం అభిమానులకు నిరాశే.


Updated : 27 Jun 2023 5:11 PM IST
Tags:    
Next Story
Share it
Top