Home > క్రీడలు > చెత్త రికార్డు..ఒక్క బంతికి 18 ర‌న్స్..!

చెత్త రికార్డు..ఒక్క బంతికి 18 ర‌న్స్..!

చెత్త రికార్డు..ఒక్క బంతికి 18 ర‌న్స్..!
X

తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఓ చెత్త రికార్డు నమోదైంది. చెపాక్ సూపర్ గిల్లీస్, సేలం స్పార్టన్స్ మధ్య మ్యాచ్‎లో ఒక్క బంతి వేయడానికి 18 పరుగులు సమర్పించుకున్నాడు ఓ బౌలర్. అది కూడా ఇన్నింగ్స్ చివరి బంతి కావడం విశేషం.

మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్లీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేయడానికి స్పార్టన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ బంతి అందుకున్నాడు. మొదటి ఐదు బంతులను వేసి కేవలం 8 పరుగులు ఇచ్చాడు. కానీ చివరి బంతికి వేసే సమయంలో అభిషేక్ పూర్తిగా అదుపుతప్పాడు. వరుస నోబాల్స్ వేసి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. 20వ ఓవ‌ర్‌లోని చివ‌రి బంతికి ఏకంగా 18 ర‌న్స్ లభించాయి. 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులుగా ఉన్న చెపాక్ టీమ్ స్కోరు.. 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లకు 217 పరుగులకు చేరింది.

చివరి బంతి సాగిందిలా..

* 20వ ఓవర్ చివరి బంతికి బ్యాటర్ బౌల్డ్ అయ్యాడు...అది నోబాల్ కావడంతో ఒక అదనపు పరుగుతో పాటు ఫ్రీ హిట్ వచ్చింది.

* తర్వాత ఫ్రీ హిట్ బంతి కూడా నోబాల్ వేయగా..దానిని బ్యాటర్ సిక్సర్‌గా మలిచాడు. దీంతో మొత్తం 8 ర‌న్స్ వచ్చాయ.

* ఆ తర్వాతి బంతి కూడా నోబాల్ వేశాడు అభిషేక్. ఈ బంతికి రెండు పరుగులు వచ్చాయి. దీంతో మొత్తం 11 పరుగులు అయ్యాయి.

* మరోసారి వైడ్ బాల్ వేశాడు..దీంతో ప‌రుగుల సంఖ్య 12కు చేరింది.

*చివ‌ర‌కు స‌రైన బంతినే వేయగా దానిని సిక్స్ కొట్టడంతో మొత్తం ఒక్క బంతికే 18 ర‌న్స్ వచ్చాయి.

218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సేలం స్పార్టన్స్ 52 పరుగుల తేడాతో ఓడిపోయింది. లక్ష్యాన్ని చేధించే క్రమంలో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేసింది.

A worst record in the Tamil Nadu Premier League..18 runs in one ball.


Updated : 14 Jun 2023 10:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top